Parenting: అందరి చూపు తనపైనే ఉండాలని
ఎనిమిదేళ్ల యశస్విని.... అందరినీ ఆకర్షించాలనుకుంటుంది. అంతా తన అల్లరినీ, ఆటల్నే చూడాలనుకుంటుంది. ఎవరినీ మాట్లాడుకోనివ్వదు. పట్టించుకోకపోతే... వస్తువుల్ని పగలగొట్టి మరీ అందరి చూపునీ తనవైపునకు తిప్పుకుంటుంది.
ఎనిమిదేళ్ల యశస్విని.... అందరినీ ఆకర్షించాలనుకుంటుంది. అంతా తన అల్లరినీ, ఆటల్నే చూడాలనుకుంటుంది. ఎవరినీ మాట్లాడుకోనివ్వదు. పట్టించుకోకపోతే... వస్తువుల్ని పగలగొట్టి మరీ అందరి చూపునీ తనవైపునకు తిప్పుకుంటుంది. ఇలాంటి ప్రవర్తన చిన్నపిల్లల్లో కనిపిస్తే ఆదిలోనే మార్చాలంటారు నిపుణులు. అదెలాగంటే...
అలక్ష్యం వద్దు... కొందరు చిన్నారులు అమ్మానాన్నలు తమపై అలక్ష్యం ప్రదర్శిస్తున్నారని అపోహపడుతుంటారు. తమ తోటివారిపైనే వారికి ప్రేమ ఎక్కువని చిన్నబుచ్చుకుంటూ ఉంటారు. ఈ భావనే అభద్రతతో ఇలా అందరి దృష్టినీ తమవైపునకు తిప్పుకొనేలా చేస్తుంది. ఇలాంటప్పుడు కొంత ఎక్కువ సమయాన్ని కేటాయించి చూడండి. మీరు దగ్గరున్నారనే ఆలోచన వారిలో ఆత్మవిశ్వాసం నింపుతుంది. క్రమంగా వారిలో మార్పూ కనిపిస్తుంది.
భయం పెట్టొద్దు... పిల్లలకు భయభక్తులు చెబితేనే క్రమశిక్షణ అలవరుచుకుంటారని కొందరు తల్లిదండ్రుల నమ్మకం. ఇందుకోసం చిన్నదానికీ, పెద్దదానికీ కళ్లెర్ర చేస్తుంటారు. దీంతో వారు ఎదుగుతున్నా భయం పోదు. ఈ క్రమంలోనే అమ్మానాన్నలకు దగ్గరవ్వడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వారి మెప్పుకోసం ఇంటికొచ్చే బంధువులెదుట డ్యాన్స్ చేయడం, పాటలు పాడటం, బొమ్మలేయడం వంటి విద్యలన్నీ ప్రదర్శిస్తారు. ఈ పరిస్థితి గమనిస్తే...మీ ప్రేమేవారికి భరోసా కావాలి. మంచి చేసినప్పుడు పొగడటం, అప్పుడప్పుడూ వారిని హత్తుకోవడం వంటివి చేయండి. కచ్చితంగా వారు అభద్రతకు దూరంగా ఉంటారు.
కొట్టిపారేయకండి... పిల్లలు ఏం చేసినా కొందరు చిన్నవాళ్లులే చూసీ చూడనట్లు వదిలేస్తారు. వారు చెప్పేది పూర్తిగా వినిపించుకోరు. ఈ తీరు ఆ పసివాళ్లలో భయాన్ని కలిగించొచ్చు. ఈ నిర్లక్ష్యమే పెద్దల దృష్టిని తమవైపు తిప్పుకోవాలనే తలంపునకు కారణం కావొచ్చు. వారేం చెప్పినా పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. వారు చెప్పేసలహాలు స్వీకరించండి. వారి అసంతృప్తులకు కారణాలు తెలుసుకోండి. ఇంటిపనీ, వంటపనుల్లో సాయాన్ని కోరండి. వారి పనులు వారు చేసుకునేలా ప్రోత్సహించండి. ఇవన్నీ వారిలో మార్పుని తీసుకొస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- అతను తగినవాడేనా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!