Relationship: కునుకు తీస్తే కుదుట పడొచ్చు
దంపతుల మధ్య వచ్చే చర్చలు కొన్నిసార్లు వాదనలుగా మారుతుంటాయి. ఆ తర్వాత మనసు తిరిగి ప్రశాంతంగా మారడానికి సమయం పడుతుంది. ఇది ఒత్తిడిగానో, కుంగుబాటుగానో మారకుండా ఉండాలంటే ఈ సూత్రాలు ఉపయోగపడతాయి.
దంపతుల మధ్య వచ్చే చర్చలు కొన్నిసార్లు వాదనలుగా మారుతుంటాయి. ఆ తర్వాత మనసు తిరిగి ప్రశాంతంగా మారడానికి సమయం పడుతుంది. ఇది ఒత్తిడిగానో, కుంగుబాటుగానో మారకుండా ఉండాలంటే ఈ సూత్రాలు ఉపయోగపడతాయి.
కునుకు తీయండి...
భాగస్వామితో అకస్మాత్తుగా ఏర్పడిన వివాదం మనసుని కుదురుగా ఉండనివ్వదు. ఇలాంటప్పుడు కాసేపు నిద్రపోవడానికి ప్రయత్నించండి. మనసంతా ఆందోళనగా ఉంటే ఎలా పడుతుందంటారా? ఓ మంచి పుస్తకం చదవండి. కాసేపు వ్యాయామం చేయండి. ఇవన్నీ నిద్ర ముంచుకొచ్చేలా చేసేవే. ఇలా పడుకోవడం వల్ల శరీరం, మనసూ తేలికవడమే కాదు...మెదడూ రిఫ్రెష్ అయి కాస్త శాంతంగా ఆలోచించగల శక్తినిస్తుంది. అప్పుడు మీ సమస్యకు సరైన పరిష్కారం లభిస్తుంది.
స్నేహితులతో మాట్లాడండి...
మనసులోని భారాన్ని దూరం చేయాలంటే స్నేహితులతోనో, సన్నిహితులతోనో కాసేపు మాట్లాడి చూడండి. మీ ఆలోచనల్నీ, ఉద్వేగాల్నీ పంచుకోండి. వారిచ్చే సలహాలు మీకు పనికొస్తాయనే కంటే...మీ మనసులోని భారాన్ని పంచుకోగలిగామనే భావనే మిమ్మల్ని ఒత్తిడి నుంచి బయటపడేస్తుంది. దీంతో ఒంటరిగా ఉన్నామనే బాధ దూరమై, సమస్యను సరైన కోణంలో ఆలోచించగలిగే శక్తి మీకొస్తుంది.
రాస్తే చాలు...
మనసుకు నచ్చిన వ్యక్తితో అనుకోకుండా వాదనలోకి దిగినప్పుడు భావోద్వేగాలను అదుపు చేసుకోవడం కష్టం. గొడవ చిన్నదైనా, పెద్దదైనా సరే...అది మనపై చూపించే ప్రభావం ఎక్కువే. దాన్ని తగ్గించుకోవడానికి మీ ఆలోచనలన్నింటికీ అక్షరూపం ఇచ్చి చూడండి. మంచీ, చెడులను గమనించుకోవడానికీ, వాదనకు కారణాన్ని గుర్తించడానికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆపై భాగస్వామితో మృదువుగా మాట్లాడగలిగి సమస్యను పరిష్కరించుకోగల నేర్పు అలవడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.