Health: చర్మానికి సహజ సంరక్షణ

సన్‌ఫ్లవర్‌ నూనె.. విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే ఆయిల్‌. వంటల్లోనే కాదు దీన్ని చర్మ సంరక్షణకూ ఉపయోగించుకోవచ్చు.

Published : 30 Apr 2023 00:22 IST

సన్‌ఫ్లవర్‌ నూనె.. విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే ఆయిల్‌. వంటల్లోనే కాదు దీన్ని చర్మ సంరక్షణకూ ఉపయోగించుకోవచ్చు. అదెలాగంటే..

తేమ పెరిగేలా... సన్‌ఫ్లవర్‌ నూనెలో ఉండే లినోలేయిక్‌ యాసిడ్‌ చర్మాన్ని పొడి బారనివ్వదు. చర్మ లోతుల నుంచి తేమ అందించి మృదువుగా మారుస్తుంది.

మొటిమలు రాకుండా... ఈ నూనెలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి తగిన పోషణ అందిస్తాయి.   ముఖ్యంగా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మొటిమలు ఏర్పడకుండా కాపాడతాయి. బ్యాక్టీరియాను దూరంగా ఉంచుతాయి.

ముడతలు పడకుండా... సన్‌ప్లవర్‌లోని పోషకాలు...చర్మం ముడతలు పడకుండా కాపాడతాయి. ముందస్తు వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయవు. ఈ నూనెలో విటమిన్‌ ఈ పుష్కలంగా ఉండటం వల్ల కొలాజెన్‌ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది చర్మాన్ని కాంతిమంతంగా కనిపించేలా చేస్తుంది.

పునరుత్తేజితమయ్యేలా... పొద్దుతిరుగుడు నూనెలో విటమిన్‌ ఏ, సీలు ఎక్కువ. ఇవి వేడి ప్రభావానికి గురైన చర్మానికి తగిన ఉపశమనం కలిగిస్తాయి.  ఈ నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్‌లు అతినీలలోహిత కిరణాల వల్ల వచ్చే పిగ్మెంటేషన్‌ సమస్యలను తగ్గిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్