Summer: ఎండల్లో.. చల్లగా!

వేసవి ఎండ మండిపోతోంది. ఏసీలు ఉన్నవాళ్లు సరే... లేనివారి సంగతేంటి? కృతిమ చల్లదనంతో బండిని లాగాలనుకోవడం... ఆర్థికంగానూ, ఆరోగ్యపరంగానూ చేటే! ఈ చిన్న చిట్కాలను పాటించేయండి..

Published : 30 May 2023 00:01 IST

వేసవి ఎండ మండిపోతోంది. ఏసీలు ఉన్నవాళ్లు సరే... లేనివారి సంగతేంటి? కృతిమ చల్లదనంతో బండిని లాగాలనుకోవడం... ఆర్థికంగానూ, ఆరోగ్యపరంగానూ చేటే! ఈ చిన్న చిట్కాలను పాటించేయండి..

ఎండ రానీయొద్దు.. ఎండ మొదలవ్వగానే కిటికీలకు పరదాలు వేసేయాలి. అవి కాటన్‌ అయితే మంచిది. వీలైనంతవరకూ లేత రంగులవి ఎంచుకోండి. కిటికీ బయటివైపూ యూవీ కిరణాలు చొచ్చుకొని రాకుండా ఉండే పీవీసీ ఫిల్మ్‌లో, హీట్‌ ప్రూఫ్‌ షీట్‌లో, గ్రీన్‌ షేడ్‌లనో వేసినా మంచిదే.

పచ్చదనాన్ని పెంచేస్తే..  మిద్దెతోట పెంచేయండి. సహజ చల్లదనం ఇంటికొస్తుంది. పచ్చని మొక్కలే కాదు మట్టి కూడా వేడిని గ్రహించేస్తాయి. మిద్దె తోట అవకాశం లేదా? వర్టికల్‌ గార్డెనింగ్‌ ప్రయత్నిస్తే సరి! కొన్ని ఇండోర్‌ మొక్కలను ఏర్పాటు చేసుకోవడమో.. గోడలకు తీగలు చెక్కల్లాంటివి ఏర్పాటు చేసుకొని తీగ మొక్కల్లాంటివి పెంచినా చల్ల గాలి ఇల్లంతా వ్యాపిస్తుంది. కిటికీ బయట టబ్బుల్లా ఏర్పాటు చేసుకొని వాటిల్లో మొక్కలు పెంచినా ప్రయోజనకరమే.

వాటిని ఆఫ్‌చేయండి.. ఎలక్ట్రానిక్‌ వస్తువులు వేడిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. ఫ్రిజ్‌లంటే తప్పదు. మిగతా టీవీ, కంప్యూటర్‌, బల్బ్‌లు, అవెన్‌ వంటివేవైనా అవసరం పూర్తయిన వెంటనే స్విచ్‌ ఆఫ్‌ చేయాలి. వంట, దుస్తులు ఉతకడం, ఐరన్‌ వంటివీ వీలైనంత వరకూ ఎండ తక్కువగా ఉన్న సమయంలోనే పూర్తి చేసుకుంటే మంచిది. గదుల్లో బల్బుల స్థానంలో ఎల్‌ఈడీ, సీఎఫ్‌ఎల్‌ఎస్‌ లైట్లకు ప్రాధాన్యమివ్వాలి.

గజిబిజిగా ఉండొద్దు.. చిందర వందరగా ఉన్న గది కూడా వేడికి మూలమే! పనికిరాని పుస్తకాలు, పేపర్లు, ఫర్నిచర్‌ వంటివి ఏమైనా ఉంటే తీసేయండి. గది మధ్యలో నీటితో నింపిన గిన్నెలో పూలను, చిన్న నీటి మొక్కలను ఉంచినా చల్లని అనుభూతి కలుగుతుంది. సాయంత్రం మిద్దెను నీళ్లతో తడపండి. వేడి ఆవిరై ఇంటికి చల్లదనం పెరుగుతుంది. ఫ్యాను కింద ఒక గిన్నెలో ఐస్‌ క్యూబ్స్‌ను ఉంచండి. వెదురు చాపలు, వట్టివేళ్ల తెరలు, తడిపిన వస్త్రాలు వంటివి కిటికీలకు అమర్చినా చల్లదనాన్ని ఆహ్వానించినట్టే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్