Published : 31/12/2022 01:17 IST

కొత్త ఏడాది వేడుక సంతోషంగా...

కొత్త ఏడాదికి స్వాగతం చెప్పేందుకు అంతా సిద్ధమేనా? పార్టీ మీరిచ్చినా, ఇతరుల ఇంటికి అతిథులుగా వెళ్లినా... కొన్ని సూత్రాలు పాటించడం తప్పనిసరి. ఎందుకంటే నలుగురితో కలిసి ఉల్లాసంగా గడిపేందుకు ఇదో చక్కని అవకాశం. ఈ వేడుకను సంతోషంగా జరుపు కోవాలంటే...

వేడుక మీరు నిర్వహిస్తున్నప్పుడు మీరే అక్కడ ప్రత్యేక ఆకర్షణ కూడా. ఇలాంటప్పుడు మీ వస్త్ర ధారణపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. మరీ ఆడంబరంగానో, మరీ సింపుల్‌గానో ఉండాలనుకో వద్దు. కంటికింపైన రంగుల్లో ఆహ్లాదంగా కనిపించే డిజైన్లతో హుందాగా ఉండేలా చూసుకోండి. కాస్త సౌకర్యంగానూ ఉండాలి. కొత్త ఏడాది స్వాగత వేడుకల్లో ధగధగ లాడాలంటే సీక్వెన్‌ టాప్‌లూ, గౌనులు బాగుంటాయి. మరీ పాశ్చాత్య దుస్తుల్ని ఎంచుకోలేం అనుకునే వారు... ఫ్యూజన్‌ రకాల్ని ఎంచుకోవచ్చు. మీరే అతిథులుగా వెళ్లాల్సి వచ్చినా ఇదే సూత్రాన్ని పాటించొచ్చు.  

పార్టీ ఎవరు ఏర్పాటు చేసినా, ఎలా చేసినా... వాటి గురించి పదే పదే ప్రస్తావించొద్దు. అక్కడ ఏ విషయాలు మిమ్మల్ని నొప్పించినా సహనంగా ఉండండి. ఉన్న సమయంలోనే అందరితో కలుపుగోలుగా, సంతోషంగా గడపడానికే ప్రాధాన్యం ఇవ్వండి.

కొత్త ఏడాది పార్టీలో పిల్లలూ ఉంటే వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయండి. వారు మెచ్చే ఆటలూ, పాటలూ, బహుమతులూ ఉంటే... వారూ మిమ్మల్ని ఇబ్బందిపెట్టరు. అలానే ఆ వేడుకలో మీదైన ముద్ర ఉండాలంటే.... మీరంతా కొత్త ఏడాది కోసం కొన్ని రిజల్యూషన్స్‌ కూడా తీసుకోవాలి. ఆరోగ్యం, ఆహారం, వినోదం వంటి అంశాలకు సంబంధించినవై ఉంటే మేలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని