అలక ముద్దు అసూయ వద్దు

పెళ్లి అనే బంధంతో ఒక్కటైన దంపతులిద్దరూ ప్రేమతో పెనవేసుకోవడమే కాదు...బాధ్యతలను సమంగా పంచుకోవాలి. సంసారాన్ని సంతోషంగా సాగించేందుకు సర్దుబాట్లెన్నో చేసుకోవాలి.

Published : 17 Feb 2023 00:25 IST

పెళ్లి అనే బంధంతో ఒక్కటైన దంపతులిద్దరూ ప్రేమతో పెనవేసుకోవడమే కాదు...బాధ్యతలను సమంగా పంచుకోవాలి. సంసారాన్ని సంతోషంగా సాగించేందుకు సర్దుబాట్లెన్నో చేసుకోవాలి.

* ఆలుమగలుగా మీ ఇద్దరూ ఒకరినొకరు ముందు అర్థం చేసుకోవాలి. అలానే, భాగస్వామితో ముడిపడిన బంధాలూ, భావోద్వేగాలూ, పరిస్థితులనూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే సమస్య ఎవరిదైనా పరిష్కారాన్ని ఇద్దరూ కలిసి చేసుకోగలుగుతారు.

* అనుబంధంలో అలకలు ఉండొచ్చు కానీ, అసూయకి, ద్వేషాలకూ చోటివ్వకూడదు. ఒకవేళ అదే జరిగితే చిన్న విషయాలే పెద్దవిగా మారిపోతాయి. ఇంటి విషయాలు కావొచ్చు. ఇతర అంశాలూ అయి ఉండొచ్చు.... ఎప్పుడైనా, ఏ విషయంలో అయినా మీ మనసు నొచ్చుకుని ఉంటే... దాన్ని అక్కడి వరకే తీసుకోండి. అలాకాకుండా ఆ బాధనీ, భావోద్వేగాల్నీ భుజాన వేసుకుని ముందుకు వెళ్లే కొద్దీ కొత్త సమస్యలు, అపార్థాలూ వచ్చి చేరుతుంటాయి. తప్పు ఎవరిదైనా...ఒక అడుగు ముందుకు వేసి చక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి. మీ చొరవే మీ అనుబంధాన్ని కాపాడుతుందని గుర్తించండి.

* భార్యాభర్తలుగా ఒకరికొకరు ముఖ్యమే. అయినంత మాత్రాన...ఇతర కుటుంబ సభ్యులతో కలవకూడదనీ, వారికి ప్రాధాన్యం ఇవ్వడం సరికాదనీ వాదించకండి. ఎంత మందిలో ఉన్నా...మీ స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని గుర్తించండి. అనుబంధాల్ని సరిగా అర్థం చేసుకుంటే...మీ కాపురమూ ఆనందంగా సాగిపోతుంది. అలాకాకుండా అసూయపడుతూ ఉంటే... అపార్థాలే మిగులుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్