Parenting: బెదిరింపులనెదుర్కొనేలా...

స్కూల్‌ మారినప్పుడు, కొత్తగా కాలేజీలో చేరినప్పుడు కొన్ని సార్లు పిల్లలకు టీజింగ్‌ లేదా బెదిరింపులూ ఎదురవుతాయి. వీటి నుంచి ఎలా బయట పడాలో తల్లిదండ్రులు ముందే నేర్పించాలంటున్నారు నిపుణులు. లేదంటే ఇవి భవిష్యత్తుపైనా ప్రభావం చూపిస్తాయంటున్నారు.

Published : 16 May 2023 00:28 IST

స్కూల్‌ మారినప్పుడు, కొత్తగా కాలేజీలో చేరినప్పుడు కొన్ని సార్లు పిల్లలకు టీజింగ్‌ లేదా బెదిరింపులూ ఎదురవుతాయి. వీటి నుంచి ఎలా బయట పడాలో తల్లిదండ్రులు ముందే నేర్పించాలంటున్నారు నిపుణులు. లేదంటే ఇవి భవిష్యత్తుపైనా ప్రభావం చూపిస్తాయంటున్నారు.

హ విద్యార్థుల బెదిరింపులు పిల్లల మానసికారోగ్యంపై ప్రభావం చూపుతాయి. రోజులో ఎక్కువ సమయం తరగతిలోనే గడిపే పిల్లలకు వారి చుట్టూ వాతావరణం సానుకూలంగా ఉంటేనే చదువుపై శ్రద్ధ, ఏకాగ్రత ఉంటాయి. లేదంటే అన్నింటా వెనుకబడటమే కాదు, మనసులోని భయాన్ని చెప్పలేక తీవ్ర ఒత్తిడికి గురవుతారు. ఇది క్రమేపీ కుంగుబాటుకు లోనుచేస్తుంది. పిల్లలను స్కూలు, కాలేజీలో చేర్చేటప్పుడు అక్కడ ర్యాగింగ్‌ ఉన్నట్లు గమనిస్తే యాజమాన్యానికి తల్లిదండ్రులు ఆ సమాచారాన్ని అందించాలి.

గుర్తించి.. విద్యాసంస్థల్లో బెదిరింపులు లేదా ర్యాగింగ్‌ ఎలా ఉంటుందో ముందుగానే పిల్లలతో చెప్పాలి. దీన్నెలా ఎదుర్కోవాలో నేర్చుకుంటే భయపడాల్సిన అవసరం లేదని అవగాహన కలిగించాలి. బాధించే వారి నుంచి ఎలా తప్పించుకోవచ్చో నేర్పించాలి. అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యుల సహకారం తీసుకుంటే ఈ సమస్యను తేలికగా పరిష్కరించుకోవచ్చని తెలియజేయాలి.

ఆత్మగౌరవాన్ని.. బాల్యం నుంచి పిల్లల్లో ఆత్మగౌరవాన్ని పెంచేలా నైపుణ్యాలను నేర్పించాలి. వారిలోని ప్రత్యేకతలను గుర్తించి ప్రోత్సాహాన్నివ్వాలి. చదువుతోపాటు చిత్రలేఖనం, పుస్తక పఠనం వంటి అభిరుచులవైపు నడిపించాలి. ఏ రంగంలో ప్రతిభ ప్రదర్శించినా ప్రశంసించాలి. ఎదుటివారు హేళన చేసినప్పుడు ఈ నైపుణ్యాలన్నీ కుంగుబాటుకు గురి కాకుండా పిల్లలను ఆత్మస్థైర్యంతో నిలబడేలా చేస్తాయి.

విమర్శించకుండా.. ఎవరైనా ఏడిపిస్తున్నారని పిల్లలు చెప్పినప్పుడు నీవల్లే ఏదో పొరపాటు జరిగి ఉంటుందని విమర్శించకూడదు. నువ్వేమీ అనకుండానే ఎదుటివారు నిన్ను ఆటపట్టిస్తున్నారా అంటూ పిల్లలపై పెద్దవాళ్లు అనుమానాన్ని వ్యక్తం చేయకూడదు. ఇలా చేస్తే ఇంట్లో తమ సమస్యలను చర్చించడానికి పిల్లలు వెనుకాడతారు. తమకెవరూ చేయూతనిచ్చేవారు లేరనే అపోహకు లోనై క్రమేపీ కుంగుబాటుకు గురవుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్