ఆందోళన తగ్గించుకోండి..

సమయానికి ప్రాజెక్టు పూర్తవుతుందా లేదా.. వంట పనంతా అలాగే ఉండిపోయింది.. ఇల్లంతా సర్దుకొని, శుభ్రం చేసుకోవాలి. ఇలా ఆలోచిస్తూ ఆందోళన, ఒత్తిడికి గురవుతున్నారా! అయితే చిన్నవయసులోనే రక్తపోటు తప్పదంటున్నారు నిపుణులు.. కాస్త దానిపై దృష్టి సారిచండి మరి..

Updated : 28 Apr 2023 13:26 IST

సమయానికి ప్రాజెక్టు పూర్తవుతుందా లేదా.. వంట పనంతా అలాగే ఉండిపోయింది.. ఇల్లంతా సర్దుకొని, శుభ్రం చేసుకోవాలి. ఇలా ఆలోచిస్తూ ఆందోళన, ఒత్తిడికి గురవుతున్నారా! అయితే చిన్నవయసులోనే రక్తపోటు తప్పదంటున్నారు నిపుణులు.. కాస్త దానిపై దృష్టి సారిచండి మరి..

వ్యాయామం.. రోజూ వ్యాయామం తప్పని సరిగా చెయ్యాలి. దాంతో శరీరం అలసిపోతుంది.. హాయిగా, తగినంత నిద్ర పడుతుంది. మెదడుకి కూడా ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటుంది. వాకింగ్‌, యోగా లాంటివే కాకుండా అప్పుడప్పుడూ కుటుంబ సభ్యులతో కలిసి ఆటల్లో పోటీ పడుతూండండి. సంతోషంగా ఉంటే హార్మోన్ల సమతుల్యతతో సమస్యలు దూరం అవుతాయి.

ఆహారం.. ఇంటిల్లిపాదినీ చూసుకొని మన తిండి దగ్గరికొచ్చేసరికి సరిగా దృష్టి పెట్టం. వేళకు సరిగా తినకుండా, తిన్నా కంగారుగా తీసుకోవటం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందవు. దాంతో అనారోగ్యాల పాలవుతాం. మన వయసుకు ఉండాల్సిన బరువు చెక్‌ చేసుకొని విటమిన్లు, ప్రొటీన్లు, పోషకాలు ఎంత అవసరమవుతాయో పట్టిక తయారు చేసుకొని దానికి తగ్గట్లుగా తీసుకోవాలి. అప్పుడే ఒత్తిడి లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు.

మీకోసం.. కొంత సమయాన్ని కేటాయించుకొని అభిరుచులపై దృష్టి పెట్టండి. పాటలు పాడటం, పెయింటింగ్‌, డ్యాన్స్‌ లాంటివి ఏది చేసినా ఒత్తిడి పోతుంది. ఆఫీసులో కానీ ఇంట్లో కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరికీ చెప్పకుండా మధనపడితే ఆందోళన తప్ప మరేమీ ఉండదు. మీ సమస్యను భాగస్వామితోనో, స్నేహితులతోనో పంచుకుంటూ ఉండాలి. అప్పుడే మనసులోని భారం తగ్గి తేలికపడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్