Painting: రంగుల ఎంపికతో అదరగొట్టేద్దాం...
ఇంటికి పెయింటింగ్ ఎప్పుడో ఒకసారి కానీ వేయించం. రంగులు వేసేటప్పుడు ఎంపికలో అజాగ్రత్తగా వ్యవహరిస్తే మళ్లీ కొన్ని సంవత్సరాల పాటు అవి అలాగే ఉంటాయి.
ఇంటికి పెయింటింగ్ ఎప్పుడో ఒకసారి కానీ వేయించం. రంగులు వేసేటప్పుడు ఎంపికలో అజాగ్రత్తగా వ్యవహరిస్తే మళ్లీ కొన్ని సంవత్సరాల పాటు అవి అలాగే ఉంటాయి. ఒక వేళ ఆ రంగు నచ్చకపోయినా మరొకటి వేయించుకోటానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి వర్ణాల ఎంపికలో శ్రద్ధ తీసుకుంటే ఇల్లు ఇంద్రధనస్సులా మారుతుంది..
* మ్యాగజైన్‌లు, క్యాట్‌లాగులూ రంగుల ఎంపికలో బాగా తోడ్పడతాయి. ఇంటర్నెట్‌లో కూడా ఇంట్లోని ఏ ప్రదేశానికి ఏ రంగు ఎంచుకుంటే బాగుంటుందో పరిశీలించండి. మీకిష్టమైన రంగుల ఎంపిక అయినా మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది.
* ఇప్పుడు పెయింట్ బ్రాండ్‌పై దృష్టి పెట్టండి. మార్కెట్లో చౌకగా దొరకుతున్నాయని తొందరపడి ఏదో ఒక బ్రాండ్‌ని ఎంచుకోవద్దు. వాటి వృత్తాంతం, రివ్యూలు, కస్టమర్ల రేటింగ్ వంటివి ప్రధానంగా పరిశీలించండి. ఆఫర్లు ఏమైనా ఉన్నాయా చూసుకొని నాణ్యమైన వాటికే ఓటేయండి..
* లైట్ కలర్స్ అయితే ఇల్లంతా నిర్మలంగా ఉంచేందుకు తోడ్పడతాయి. పిల్లలు ఉండి గోడలపై మరకలు పడేస్తారు అనుకుంటే.. కొత్తగా తడి డస్టర్‌తో తుడిస్తే మరకలు తొలగిపోయే పెయింట్లూ వచ్చాయి. వాటిని ఎంచుకోవచ్చు.
* ఇల్లంతా మీకు నచ్చినట్టు రంగులు వేయించుకున్నా.. పిల్లల గదిని మాత్రం వారికే వదిలేయండి. వారికిష్టమైన రంగులతో, కాంట్రాస్ట్ కలర్ బొమ్మలతో ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఇస్తే.. ఎగిరి గంతులేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.