Vegetarians: మీరు శాకాహారులా!

జీవక్రియలు సక్రమంగా జరగాలన్నా, మెదడు, నరాల పనితీరు బాగుండాలన్నా మన శరీరంలో విటమిన్‌ బి12 సరిపడా ఉండాలి. ఇది లోపిస్తే నిస్సత్తువ, నీరసం ఆవహిస్తాయి.

Published : 11 Apr 2023 00:48 IST

జీవక్రియలు సక్రమంగా జరగాలన్నా, మెదడు, నరాల పనితీరు బాగుండాలన్నా మన శరీరంలో విటమిన్‌ బి12 సరిపడా ఉండాలి. ఇది లోపిస్తే నిస్సత్తువ, నీరసం ఆవహిస్తాయి. మన శరీరం సొంతంగా బి12ను తయారు చేసుకోలేదు. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో ఇది అందేలా చూసుకోవాలి. సాధారణంగా గుడ్లు, మాంసం వంటి వాటిల్లో విటమిన్‌ బి12 అధికంగా ఉంటుంది. అయితే మాంసం తినని వారిలో ఈ లోపం వచ్చే అవకాశం ఉంది. కానీ శాకాహారంలోనూ విటమిన్‌ బి12 పుష్కలంగా లభించేవి ఉన్నాయి. అవేమిటో చూద్దామా!

పాలకూర.. పాలకూరలో విటమిన్‌ బి12 అధికంగా ఉంటుంది. దీన్ని తరచూ కూరలు, పప్పు, స్మూతీలు ఇలా అన్నిట్లో వినియోగిస్తే పోషకాలు అందుతాయి. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు తరచూ పాలకూర తింటుంటే రక్తహీనత తగ్గుతుంది.

బీట్‌రూట్‌.. ఇందులో ఐరన్‌, ఫైబర్‌, పొటాషియం, విటమిన్‌ బి12 అధికంగా ఉంటాయి. బీట్‌రూట్‌ను రోజూ ఆహారంలో భాగంగా చేసుకుంటే జుట్టు ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. చర్మం మెరుపును సంతరించుకుంటుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీరానికి బలాన్నిస్తుంది.


పాలపదార్థాలు.. రోజూ రెండు కప్పుల పాలు తాగటం వల్ల శరీరానికి కావాల్సిన ప్రొటీన్‌, కాల్షియం, ఫాస్ఫరస్‌, పొటాషియం, విటమిన్‌ బి12 అందుతాయి. చీజ్‌, పెరుగులో ప్రొటీన్‌, విటమిన్‌ బి12 ఎక్కువ. ఇందులో బెర్రీలు లాంటివి వేసుకుని స్నాక్‌లా కూడా తినొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని