సమస్యలొస్తాయ్‌ జాగ్రత్త..

ఫ్యాషన్‌, సౌకర్యం, శ్రద్ధ... పేరుతో నిత్యం మనం చేసే కొన్ని పనుల వల్ల కొత్త సమస్యలు ఎదురుకావొచ్చు.  హాని కూడా కలగొచ్చు. అవేంటో చూడండి.

Published : 25 Mar 2023 00:26 IST

ఫ్యాషన్‌, సౌకర్యం, శ్రద్ధ... పేరుతో నిత్యం మనం చేసే కొన్ని పనుల వల్ల కొత్త సమస్యలు ఎదురుకావొచ్చు.  హాని కూడా కలగొచ్చు. అవేంటో చూడండి..

* ఎండ, కాలుష్యం నుంచి రక్షణగా కట్టుకునే స్కార్ఫ్‌వల్ల జుట్టు రాలడం, మొటిమలు వంటి ఇబ్బందులు ఎదురువుతాయి. దుమ్ము, ధూళి నుంచి రక్షణగా వాడే సాక్సులు, గ్లవుజులను ఎక్కువ సమయం ఉంచుకోవడం, పదేపదే వాడటం చేయకూడదు. ఇన్‌ఫెక్షన్లకు దారి తీస్తాయి.

* ఒంటికి అతుక్కుపోయే లెగ్గింగ్స్‌, జెగ్గింగ్స్‌ వంటి వాటిని ఎక్కువ సమయం వేసుకుంటున్నారా?చర్మానికి గాలి తగలదు. అలర్జీలు ఇబ్బందిపెడతాయి. వీలైతే తక్కువ సమయం వాడేందుకు ప్రయత్నించండి.

* ఎప్పుడూ చెప్పులేసుకొని తిరగటం వల్ల పాదాలు మరీ సున్నితంగా మారతాయి. గార్డెన్‌లో అయినా సరే కాసేపు చెప్పులేసుకోకుండా నడిచి చూడండి. ఒత్తిడి తగ్గి, రక్త సరఫరా మెరుగుపడుతుంది. ఉదయం వేసుకున్న మేకప్‌ తీయకుండా పడుకోవద్దు. తలకి పెట్టుకునే పిన్నులు, రబ్బరు బ్యాండ్లతో జుట్టు బిగుతుగా ఉంటుంది. అప్పటికవి అందంగానే ఉన్నా భవిష్యత్తులో జుట్టు ఎక్కువగా రాలుతుంది.

* బిగుతైన బ్రాలు వాడటం వల్ల క్యాన్సర్లు వస్తున్నట్లు వివిధ అధ్యయనాల్లో తేలింది. నిద్రపోయే ముందు వాటిని తీసేయడం మర్చిపోకండి.

* ఫ్యాషన్‌ యాక్సెసరీస్‌ వాడే విధానంలో తెలిసీ, తెలియక తప్పులు జరిగితే అవి మన శరీరానికి అనారోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. అందుకే కొత్త వస్తువులు వాడేప్పుడు వాటి ప్రయోజనాలు, దుష్ఫలితాలను తప్పనిసరిగా తెలుసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్