Women Empowerment: భయం వదిలితేనే..
భర్త, పిల్లలు వారి బాగోగులు ఇలా అన్నింటి కోసం ఎన్నో త్యాగాలు చేస్తాం. కష్టపడి చదివిన డిగ్రీలు, పీజీలు కూడా పక్కన పెట్టి ఇంటికే పరిమితమయ్యే వారూ ఉన్నారు.
భర్త, పిల్లలు వారి బాగోగులు ఇలా అన్నింటి కోసం ఎన్నో త్యాగాలు చేస్తాం. కష్టపడి చదివిన డిగ్రీలు, పీజీలు కూడా పక్కన పెట్టి ఇంటికే పరిమితమయ్యే వారూ ఉన్నారు. వృత్తి జీవితంలో ముందుకు సాగాలని, తమకంటూ సొంత గుర్తింపు సంపాదించుకుందామనుకున్నా అక్కడే ఆగిపోతుంటారు. ఆ పరిస్థితిని అధిగమించి లక్ష్యాన్ని సాధించాలంటే..
కచ్చితంగా ఉంటే.. పిల్లలు పుట్టిన తర్వాత ఉద్యోగ ప్రయత్నం చేయాలంటే కొందరు ఆలోచిస్తారు. ఇందుకు కారణం మార్కెట్ డిమాండ్‌కి తగ్గ నైపుణ్యాలు లేవనే భయం. కాస్త సమయం కేటాయించుకుని.. వాటిని నేర్చుకోగలిగితే అవకాశాలు ఎదురువస్తాయి.
పనులు పంచాలి.. ఇంట్లో అన్ని పనులూ మీరే చేయాలన్న తపన వద్దు. ఆ బాధ్యతల్ని ఇతర కుటుంబసభ్యులకూ పంచాలి. ఏ పని ఎవరు ఎప్పుడు చెయ్యాలో వివరంగా చెప్పగలగాలి. అప్పుడే ఒత్తిడి లేకుండా ఉండగలం. మనకంటూ కొంత సమయాన్నీ మిగుల్చుకోగలం.
స్నేహితులతో బయటకువెళ్లి.. అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి అలా బయటకు వెళ్లండి. ఏ విషయం గురించైనా సలహా కావాలంటే అడగటానికి సంకోచించొద్దు. మనలాంటి ఆలోచనలతో సరిపోలే వ్యక్తులతో తరచూ మాట్లాడుతూ ఉండండి. ఏవైనా మహిళలకు సంబంధించిన గ్రూపుల్లోనూ చేరండి. ఇవన్నీ మనకు కొత్త సమాచారం తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.