Exercise: వేసవిలో విసుగొస్తుందా

మామూలుగానే ఎండవేడికి చెమట చిరాకు పెడుతుంటుంది. ఇక వ్యాయామం చేస్తోంటే ఇంకా ఇబ్బంది పెట్టేయదు? అలాగని విరామం ప్రకటించేద్దాం అనుకుంటున్నారా! అదే వద్దంటున్నారు నిపుణులు.

Published : 28 Feb 2023 00:59 IST

మామూలుగానే ఎండవేడికి చెమట చిరాకు పెడుతుంటుంది. ఇక వ్యాయామం చేస్తోంటే ఇంకా ఇబ్బంది పెట్టేయదు? అలాగని విరామం ప్రకటించేద్దాం అనుకుంటున్నారా! అదే వద్దంటున్నారు నిపుణులు.

* ఈకాలం త్వరగా పొద్దెక్కుతుంది. వేడీ వేగంగా ప్రారంభమవుతుంది. రోజూ చేసే సమయానికి గంట ముందుకి షెడ్యూల్‌ మార్చుకోండి. సూర్యోదయానికి ముందే వ్యాయామం ప్రారంభిస్తే.. వాతావరణం చల్లగా ఉంటుంది. కాబట్టి, చెమట సమస్య ఉండదు. పోనీ.. చల్లటి నీటితో స్ప్రే బాటిల్‌ దగ్గర పెట్టుకోండి. వ్యాయామం తర్వాత ఒళ్లు వేడెక్కినట్టు అనిపించినా, చిరాగ్గా అనిపించినా ముఖాన ఈ నీటిని స్ప్రే చేసుకుంటే తాజాగా అనిపిస్తుంది.

* ఏకధాటిగా చేయడం కూడా ఒక సమస్యే! కాబట్టి, ఉదయం లేదా సాయంత్రం ఒక గంట అన్న పక్కా నియమాలొద్దు. ఉదయం 10 నిమిషాలే చేయాలనిపించిందా అంతే చేయండి. సాయంత్రం కుదిరితే అప్పుడే చేయండి. ఆఫీసులో భోజనమయ్యాక నాలుగు అడుగులేసినా సరే! ఎప్పుడు చేశామన్న దానికంటే దాన్ని కొనసాగించామా లేదా అన్నదానికే ప్రాధాన్యం ఇవ్వాలి.

* వేడికి ఒంట్లో సత్తువ అంతా క్షీణిస్తున్నట్లు అనిపిస్తుంది. రోజూ చేసే వ్యాయామాలైనా ఈ కాలం త్వరగా అలసిపోతుంటాం. కాబట్టి, పక్కాగా అనుకున్నవన్నీ చేసేయాలన్న కఠిన నిబంధనలొద్దు. ఇంట్లో, జిమ్‌లో కుస్తీలు పట్టలేకపోతున్నా అనిపిస్తే స్విమ్మింగ్‌, షటిల్‌, సాయంత్ర చల్లగాలికి నడక.. ఇలా ఏవైనా కొత్తవి ప్రయత్నించినా ప్రయోజనకరమే!

* దుస్తుల ఎంపికనీ చూసుకోవాలి. వదులుగా, తక్కువ వేడిని గ్రహించే లేత రంగు వస్త్రాలకే ప్రాధాన్యం ఇవ్వండి. చెమటను త్వరగా పీల్చుకునేలానూ ఉండాలి. వెంట నీళ్లసీసా ఉంచుకోవడం తప్పనిసరి. ప్రతి 15 నిమిషాలకు నీరు తీసుకునేలా నియమం పెట్టుకుంటే డీహైడ్రేషన్‌, అలసట వంటివి ఉండవు. అయితే ఒకేసారి ఎక్కువగా తీసుకోవద్దు. కొద్దికొద్దిగా తీసుకుంటే కడుపులో తిప్పడం, నొప్పి వంటివి ఉండవు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్