Business Women: వ్యాపారం మొదలెడుతున్నారా!
ఉద్యోగంతో సంతృప్తి చెందలేని, కెరియర్‌లో ఎదగాలనుకునే ఎంతో మంది మహిళలు ఆంత్రప్రెన్యూర్స్‌గా అవతారమెత్తుతున్నారు. కలలు నేరవేర్చుకునేందుకు ధైర్యంగా ఇంకో అడుగు ముందుకేస్తున్నారు.
ఉద్యోగంతో సంతృప్తి చెందలేని, కెరియర్‌లో ఎదగాలనుకునే ఎంతో మంది మహిళలు ఆంత్రప్రెన్యూర్స్‌గా అవతారమెత్తుతున్నారు. కలలు నేరవేర్చుకునేందుకు ధైర్యంగా ఇంకో అడుగు ముందుకేస్తున్నారు. ఆడవాళ్లు మీకెందుకు వ్యాపారం అనేవారే కానీ.. ఇలా చేస్తే లాభం పొందొచ్చు. అలా చేస్తే పని సులువవుతుంది అని సలహాలిచ్చేవారుండరు. అలాంటి వారి కోసమే కొన్ని సలహాలిస్తున్నారు నిపుణులు..
* ముందుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఎలాంటి స్కీములు ఉన్నాయో తెలుసుకోండి. మీరు ఎంచుకున్న వ్యాపారానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం తీసుకోవచ్చో శోధించండి. అనుమతులూ, సర్టిఫికెట్లూ వంటివి ఏం కావాలో చూసుకున్నాకే ముందడుగు వేయండి.
* ముడిసరకు, మెషినరీ కంగారుతో ఎక్కువ ఖరీదు పెట్టి కొనేయొద్దు. ఎక్కడ నాణ్యమైనవి, చౌకైనవి దొరుకుతాయో తెలుసుకుని కొనుగోలు చేయాలి. ప్రభుత్వం సబ్సిడీలేమైనా వస్తాయేమో కూడా గమనించుకుంటే సరి.
* మీ ఉత్పత్తులను అమ్మడానికి ముందు... బహిరంగ మార్కెట్‌లో ఎంత ధర ఉంది. ప్రైవేటుగా ఎంతకు అమ్ముడుపోతుందో తెలుసుకోవాలి. తర్వాతే ప్రొడక్ట్స్‌ని ఎక్కడ, ఎప్పుడు మార్కెట్ చేయాలో అర్థమవుతుంది. లాభనష్టాల తూకమూ తెలుసుకోగలుగుతారు.
* ఏ చిన్నదాన్ని నిరుపయోగంగా పోనీయక పోవడం.. వ్యాపారుల లక్షణం. మీ ఉత్పత్తి వ్యర్థాలు మరో రకంగా ఏమైనా ఉపయోగపడతాయేమో కూడా సరి చూసు కోవాలి. అనవసరం అనుకున్న వస్తువులు కూడా ఒక్కోసారి అక్కరకు వస్తాయి. అలాంటివి మనకు కాకపోయినా ఇతరులకు ఉపయోగపడితే మేలే కదా!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.