Parenting: పిల్లలు చక్కగా ఎదగాలంటే...

చాలామంది తల్లులకి తమ పిల్లలు పెరగాల్సినంత ఎత్తు పెరగరేమోనని లోలోపల దిగులుగా ఉంటుంది. అందుకోసం ప్రొటీన్లు ఎక్కువున్న ఆహారం పెడుతుంటారు.

Updated : 13 May 2023 04:43 IST

చాలామంది తల్లులకి తమ పిల్లలు పెరగాల్సినంత ఎత్తు పెరగరేమోనని లోలోపల దిగులుగా ఉంటుంది. అందుకోసం ప్రొటీన్లు ఎక్కువున్న ఆహారం పెడుతుంటారు. కానీ అది మోతాదు మించితే ప్రమాదం. దానికంటే యోగా మేలు చేస్తుంది. ఎటూ వేసవి సెలవులు కనుక ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లూ అవుతుంది. రోజూ ఉదయం లేవగానే కాసేపు యోగా చేయించండి. ముఖ్యంగా ఎత్తు పెరగడానికి తాడాసనం బాగా పనిచేస్తుంది. ఇది ప్రతి రోజూ చేయాలి. దీని వల్ల చేకూరే లాభాల గురించి చెబితే పిల్లలకీ ఇష్టంగానే ఉంటుంది.

ఎలా చేయాలంటే..

రెండు పాదాలనూ దగ్గరగా ఉంచి నిలబడాలి. రెండు చేతులూ తల కంటే పైకి తీసుకెళ్లి వేళ్లను కలిపి అరచేతులు పై వైపున ఉండేలా తిప్పి పెట్టాలి. శ్వాస తీసుకుంటూ మెల్లగా కాలి మునివేళ్ల మీద నిలబడాలి. అలా కొన్ని క్షణాలు శరీరాన్ని బ్యాలెన్స్‌ చేయడానికి ప్రయత్నించాలి. పాదాల దగ్గర్నుంచి చేతుల వరకూ శరీరాన్ని పైకి లేపుతున్నట్టుగా చేయాలి. ఐదారు క్షణాలు అలా ఉండి, నెమ్మదిగా శ్వాస వదులుతూ మడాలను కింద పెట్టి యథాస్థితికి వచ్చేయాలి. ఇలా శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి పదిసార్లు చొప్పున చేయాలి. ఈ తాడాసనాన్ని క్రమం తప్పకుండా వేసేలా చూడండి.

ఇవీ ప్రయోజనాలు..

శరీర ఎదుగుదలకు, ఎముకల దృఢత్వానికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. పిల్లలు పొడవు సాగుతారు. ఇది పూర్తి బాడీ స్ట్రెచింగ్‌ అన్నమాట. శరీర ఎదుగుదలతో పాటు బ్యాలెన్సింగ్‌ చేసుకోవడం అలవాటవుతుంది. ఎముకల పటుత్వానికి, బలానికి కూడా మంచిదే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్