Parenting: పాలపళ్లు వస్తున్నాయా..
కొత్త అమ్మలకు పిల్లల పెరుగుదలలో ప్రతి దశా అమూల్యమే. అందుకు ‘తొలి పన్ను’ మినహాయింపేం కాదు. మనకి సంబరమే కానీ.. అవి వచ్చే సమయంలోనే చిగుళ్ల దురద, నొప్పితో పిల్లలు తెగ ఇబ్బంది పడతారు. దాన్ని తొలగించేయండిలా.
కొత్త అమ్మలకు పిల్లల పెరుగుదలలో ప్రతి దశా అమూల్యమే. అందుకు ‘తొలి పన్ను’ మినహాయింపేం కాదు. మనకి సంబరమే కానీ.. అవి వచ్చే సమయంలోనే చిగుళ్ల దురద, నొప్పితో పిల్లలు తెగ ఇబ్బంది పడతారు. దాన్ని తొలగించేయండిలా..
* శుభ్రమైన వస్త్రాన్ని తీసుకొని ఫ్రిజ్‌లో కొద్దిసేపు ఉంచండి, చల్లగా అయ్యాక తీసి, పాపాయికివ్వండి. దంతాలు వచ్చేప్పుడు చిగురు వాచి, నొప్పి వస్తుంది. ఈ చల్లదనం నొప్పిని లాగేస్తుంది. అయితే.. మరీ గడ్డ కట్టించొద్దు. సన్నగా పేరుకున్న మంచు ముక్కలు చిన్నారుల నోట్లో గాయానికి కారణమవొచ్చు. మార్కెట్‌లో బోలెడు రకాలు ‘టీతర్లు’ పేరుతో దొరుకుతున్నాయి. వాటిలో ప్లాస్టిక్‌వి ఎంచుకోవద్దు. సిలికాన్‌వి తెచ్చుకొని, వాటినీ కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి, ఇస్తే మంచిది.
* మృదువైన బ్రష్‌ను ఎంచుకొని మృదువుగా చిగుళ్లపై రుద్దండి. దురదే కాదు.. రక్తప్రసరణ బాగా జరిగి, వాపు కూడా తగ్గుతుంది.
* టొమాటో, వంకాయ, యాపిల్, కీర వంటి పైచర్మం మృదువుగా ఉండే పండ్లను ఉప్పు నీటిలో కడిగి ఇవ్వండి. ఇవీ సాయపడే మార్గాలే. ఒత్తిడికి అవి చితికి ఇల్లు కాస్త పాడవొచ్చేమో కానీ పిల్లలకు మాత్రం మంచి ఉపశమనం.
* పాల దంతాలు వచ్చే సమయంలో కొందరు చిన్నారులు విపరీతంగా కొరుకుతుంటారు. ఇంకొందరికి జ్వరం వంటివీ వస్తాయి. చిగుళ్ల వద్ద వచ్చే విపరీతమైన నొప్పే అందుకు కారణం. తట్టుకోలేకపోతున్నారు అనిపిస్తే వైద్యులను సంప్రదించండి. వాళ్లకి హాని కలిగించని మందులు, జెల్స్ వంటివి సూచిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.