Health tips: తలనొప్పిని తగ్గించే పానీయాలు

మనం ఎక్కువగా ఎదుర్కొనే ఇబ్బందుల్లో తలనొప్పి ఒకటి. దీనికి ఒత్తిడి, అలసట, విటమిన్ల లోపం, నిద్రలేమి.. లాంటి కారణాలెన్నో! ఇదిగో ఈ పానీయాలతో దానికి ఉపశమనం లభిస్తుందట.

Updated : 31 May 2023 02:26 IST

మనం ఎక్కువగా ఎదుర్కొనే ఇబ్బందుల్లో తలనొప్పి ఒకటి. దీనికి ఒత్తిడి, అలసట, విటమిన్ల లోపం, నిద్రలేమి.. లాంటి కారణాలెన్నో! ఇదిగో ఈ పానీయాలతో దానికి ఉపశమనం లభిస్తుందట.

తులసి టీ...

విటమిన్‌ కే, ఏ లు పుష్కలంగా ఉంటాయి. గుప్పెడు తులసి ఆకుల్ని రెండు కప్పుల నీటిలో వేసి కప్పు నీరు అయ్యేంత వరకూ మరిగించాలి. ఈ పానీయాన్ని టీ లా తాగాలి. ఇది తలనొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.


చామంతి టీ...

షధ గుణాలు అధికం. చామంతి ఒత్తిడి తగ్గిస్తుంది. వివిధ రకాల డైట్‌లలోనూ దీనిని ఉపయోగిస్తారు. కొన్ని చామంతి పూలను మూడు గ్లాసుల నీటిలో వేసి మరిగించాలి. దింపాక నిమ్మ రసం పిండి తాగితే సరి.


పుదీనా టీ...

హజంగానే ఔషధాలు మెండుగా ఉండే పుదీనాను, ఈ వేసవిలో చలువచేసే పానీయాల్లో వాడుతుంటారు. అలాగే మరిగించిన వేడి నీటిలో కొన్ని పుదీనా ఆకులను వేసి మూతపెట్టి, పది నిమిషాల తర్వాత తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.


లావెండర్‌ టీ....

పూలల్లో డై మిథైల్‌ రసాయనాలు ఉంటాయి. ఇవి నాడీవ్యవస్థ పై పనిచేసి నిద్రలేమిని తగ్గించి, ఒత్తిడికి గురైన నరాలను ఉత్తేజపరుస్తాయి. 15 గ్రాముల లావెండర్‌ పొడిని లీటర్‌ వాటర్‌లో వేసి మరిగించి సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది.


సోంపు టీ....

దీనిలో విటమిన్‌ బి1, బి2, బి3, కాల్షియం, జింక్‌, ఐరన్‌, పొటాషియం ఉంటాయి. సోంపును నీళ్లలో వేసి మరిగించి టీ లా సేవిస్తే తలనొప్పి నుంచి ఊరట కలుగుతుంది.


అల్లం వెల్లుల్లి కషాయం...

రోగ్యానికి దివ్యౌషధం మనం రోజూ వంటల్లో ఉపయోగించే అల్లం. దీనిలో విటమిన్‌ సి, ఇ, కాల్షియం, జింక్‌ ఉంటాయి. మూడు గ్లాసుల నీటిలో చిన్న అల్లంముక్క, నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకటిన్నర గ్లాసు అయ్యేవరకు మరిగించాలి. తర్వాత వడపోసి ఈ కషాయాన్ని తాగాలి. అల్లంలో ఉండే సి విటమిన్‌ రోగనిరోధక శక్తిని పెంచి తలనొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని