రీహైడ్రేట్‌ అవ్వండిలా...

వేసవిలో బయటికి వెళ్లాలంటేనే భయమేస్తుంది. చిన్న పిల్లల్ని, పెద్దవాళ్లని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. బయటికెళ్లొచ్చిన వెంటనే రీహైడ్రేట్‌ అవ్వాలంటే కొన్ని చిట్కాలను పాటిస్తే సరి... అవేంటంటే... నీళ్లు... శరీరాన్ని హైడ్రేట్‌ చేసే నీటితో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

Published : 13 Mar 2023 00:07 IST

వేసవిలో బయటికి వెళ్లాలంటేనే భయమేస్తుంది. చిన్న పిల్లల్ని, పెద్దవాళ్లని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. బయటికెళ్లొచ్చిన వెంటనే రీహైడ్రేట్‌ అవ్వాలంటే కొన్ని చిట్కాలను పాటిస్తే సరి... అవేంటంటే...

నీళ్లు... శరీరాన్ని హైడ్రేట్‌ చేసే నీటితో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

కాఫీ, టీ... మితమైన మోతాదులో కాఫీ, టీలతో శరీరానికి శక్తి వస్తుంది. అలాగే బాదంపాలు, టీలో దాల్చినచెక్క, లెమన్‌గ్రాస్‌, జాజికాయ వంటివి చేర్చడం ద్వారా హైడ్రేట్‌ అవొచ్చు.

లోఫ్యాట్‌ మిల్క్‌... పాలల్లో అధిక ఎలక్ట్రోలైట్స్‌ ఉంటాయి. ఇవి శరీరంలోని నీటినిల్వలను సమతుల్యం చేయడానికి ఉపయోగపడతాయి.

పండ్లు,కూరగాయలు... కొన్ని పండ్లు, కూరగాయల్లో 80-90 శాతం నీరు ఉంటుంది. డీహైడ్రేట్‌ అయ్యేటప్పుడు పండ్ల రసాలవల్ల ఉపశమనం పొందొచ్చు. విటమిన్‌ సి ఉన్న పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యతనిస్తే సత్వర ఫలితాన్ని పొందొచ్చు.

ఓరల్‌ హైడ్రేషన్‌ సొల్యూషన్స్‌... సమస్య ఎక్కువై వాంతులు, విరేచనాలు వంటివి వస్తే... ఓరల్‌ హైడ్రేషన్‌ సొల్యూషన్స్‌ వినియోగించాలి. ఇందులో ఎక్కువ శాతం సోడియం, క్లోరైడ్‌, ఎలక్ట్రోలైట్స్‌ ఉండటం వల్ల అలసట, నీరసం తగ్గుతాయి.

ఇవి అందుబాటులో లేనప్పుడు లీటర్‌ నీళ్లలో, 6 చెంచాల చక్కెర, అర చెంచా ఉప్పు కలిపి తాగితే ఎండదెబ్బ నుంచి బయటపడొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్