Neck Pain: మెడ నొప్పికి చెక్ పెట్టేద్దాం…

రోజంతా అనేక పనులు చేస్తుంటాం కాబట్టి ఇక వ్యాయామం చేయనవసరం లేదు అనుకుంటారు కొందరు. కానీ అది సరికాదు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా లేదా వ్యాయామం తప్పనిసరి. ముఖ్యంగా మనల్ని తరచూ ఇబ్బంది పెట్టే మెడనొప్పి నుంచి బయటపడాలంటే ఈ తేలికైన ఎక్సర్‌సైజులు చేయండి.

Updated : 01 Apr 2023 05:17 IST

రోజంతా అనేక పనులు చేస్తుంటాం కాబట్టి ఇక వ్యాయామం చేయనవసరం లేదు అనుకుంటారు కొందరు. కానీ అది సరికాదు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా లేదా వ్యాయామం తప్పనిసరి. ముఖ్యంగా మనల్ని తరచూ ఇబ్బంది పెట్టే మెడనొప్పి నుంచి బయటపడాలంటే ఈ తేలికైన ఎక్సర్‌సైజులు చేయండి. కొద్ది రోజుల్లోనే ఫలితం ఉంటుంది...

కింద సదుపాయంగా ఉండేలా కూర్చుని, రెండు చేతులను తొడల పక్కగా ఉంచి అరచేతులను పరిచినట్లు పెట్టండి. మెడ మాత్రమే కదిలేలా ముఖాన్ని మెల్లగా కుడివైపునకు వెళ్ల గలిగినంత దూరం వెళ్లనిచ్చి ఎదురుగా తీసుకురండి. ఎడమవైపు కూడా అలాగే చేయాలి. ఇలా ఐదుసార్లు కుడివైపు, ఐదుసార్లు ఎడమవైపు చేయండి. తర్వాత తలను మెల్లగా కిందికి వంచి, అంతే నెమ్మదిగా పైకి లేపి, వెనక్కి తీసుకెళ్లండి. ఇది కూడా ఐదుసార్లు చేయండి.

తలను కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడివైపునకు ఆరుసార్లు తిప్పండి.

కుడి చేతిని తల మీద పెట్టి తలను కుడి భుజం మీదికి వంచండి. ఆనక ఎడమ చేతిని తల మీద పెట్టి ఎడమ భుజం మీదికి వంచండి. మొదటిరోజే ఎక్కువ వంచి ఇబ్బంది పడొద్దు.

ఇవీ ప్రయోజనాలు

నెక్‌ ఎక్సర్‌సైజుల వల్ల కండరాలు బలపడతాయి. రక్త ప్రసరణ సాఫీగా ఉంటుంది. చేతులు, భుజాలు, శరీరం దృఢంగా తయారవుతాయి. బిగుసుకుపోయినట్లు ఉండదు, ఎలా అంటే అలా వంచగలుగుతాం. మెడ, వీపు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.  

జాగ్రత్తలు

వ్యాయామం చాలా నెమ్మదిగా చేయాలి. మెడను తేలిగ్గా వంచగలిగినంతే వంచాలి, అసౌకర్యం కలగనంత వరకే తిప్పాలి. ఏ కాస్త నొప్పిగా, ఇబ్బందిగా అనిపించినా ఆపేయండి. అపసవ్యంగా చేస్తే మెడ, వీపు, భుజాలు పట్టేస్తాయి. నొప్పి తగ్గకపోగా తీవ్రమవుతుంది. తలనొప్పి కూడా వస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్