వీపుపై పొక్కులు, మొటిమలు .. ఇలా తగ్గించుకోండి..!

మొటిమలంటే ముఖం పైనే వస్తాయనుకుంటాం. కానీ వేడి, హ్యుమిడిటీతో కూడిన ఈ వేసవిలో వీపు పైనా మొటిమలు, కురుపులు వచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు. ఇందుకు చెమట, జిడ్డుదనమే ప్రధాన కారణాలుగా....

Published : 07 May 2023 10:40 IST

మొటిమలంటే ముఖం పైనే వస్తాయనుకుంటాం. కానీ వేడి, హ్యుమిడిటీతో కూడిన ఈ వేసవిలో వీపు పైనా మొటిమలు, కురుపులు వచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు. ఇందుకు చెమట, జిడ్డుదనమే ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. వీటిని తొలగించుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉపయోగపడతాయంటున్నారు. మరి, అవేంటో తెలుసుకుందాం రండి..

బయటి నుంచి ఇంటికొచ్చిన తర్వాత, అలాగే వ్యాయామం పూర్తైన వెంటనే శుభ్రంగా స్నానం చేయడం ముఖ్యం. తద్వారా చెమట ఎప్పటికప్పుడు తొలగిపోయి సమస్య క్రమంగా తగ్గుతుంది. లేదంటే చెమటతో కూడిన దుస్తుల వల్ల ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

ఎవరి వీపు వారికి అందదు. దాంతో పైపైన శుభ్రం చేసుకుంటుంటారు. దీనివల్ల అక్కడ చేరిన మురికి, జిడ్డుదనం తొలగిపోక మొటిమలు, కురుపుల సమస్య తలెత్తుతుంది. కాబట్టి తరచూ వీపును స్క్రబ్‌ చేసుకోవడం మంచిది. ఇందుకోసం ఇంట్లో తయారుచేసుకునే సహజసిద్ధమైన స్క్రబ్స్‌ని ఉపయోగించచ్చు.. లేదంటే బయట దొరికే సెలిసిలిక్ ఆమ్లంతో కూడిన స్క్రబ్స్‌ని నిపుణుల సలహా మేరకు వాడచ్చు.

టీట్రీ ఆయిల్‌ ఎన్నో చర్మ సమస్యల్ని దూరం చేస్తుంది. కాబట్టి ఈ నూనెతో తరచూ వీపును మర్దన చేసుకోవడం మంచిది. అలాగే టీట్రీ ఆయిల్‌ వాడి తయారుచేసిన లోషన్లు, క్లెన్సర్లు, క్రీమ్స్‌ ఉపయోగించినా ఫలితం ఉంటుంది.

సన్‌స్క్రీన్ వీపుకీ అవసరమే. ఎందుకంటే చెమట, దుమ్ము కారణంగా మూసుకుపోయిన చర్మ రంధ్రాలు తెరుచుకునేందుకు ఇది సహాయపడుతుంది. ఫలితంగా అక్కడి చర్మ కణాలు శుభ్రపడి మొటిమల సమస్య వేధించదు. అయితే నూనె పదార్థం వాడని సన్‌స్క్రీన్‌ లోషన్లు ఎంచుకోవాల్సి ఉంటుంది.

బిగుతుగా ఉండే దుస్తులు కూడా అధిక చెమటకు, తద్వారా వీపుపై మొటిమల సమస్యకు కారణమవుతుంటాయి. కాబట్టి వదులుగా ఉండే కాటన్‌ దుస్తుల్ని ఎంచుకోవడం మంచిది.

వీపుపై మొటిమల సమస్యకు చెక్‌ పెట్టడానికి గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ (GI) అధికంగా ఉండే ఆహార పదార్థాలు కారణమవుతుంటాయి. కాబట్టి GI తక్కువగా ఉండే కాయగూరలు, పండ్లు, తృణధాన్యాలు.. వంటివి ఆహారంలో చేర్చుకుంటే ఫలితం ఉంటుంది.

జుట్టును వదిలేయడం ఈ తరం అమ్మాయిల హెయిర్‌స్టైల్‌. అయితే దీనివల్ల కూడా వీపుపై మొటిమలొచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు. జుట్టులోని నూనెలే ఇందుకు కారణమట! కాబట్టి కురులు విరబోసుకోకుండా పోనీ టెయిల్‌ వేసుకోవడం, ముఖ్యంగా నూనె పెట్టుకున్న సమయాల్లో బన్‌ హెయిర్‌స్టైల్‌ వేసుకోవడం మంచిది.

ఒత్తిడి, ఆందోళనల వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది చర్మంపై మొటిమలకు కారణమవుతుంది. కాబట్టి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి యోగా, ధ్యానం.. వంటి వ్యాయామాలు తప్పనిసరి.

ఇవన్నీ పాటించినా సమస్య తగ్గకపోతే మాత్రం.. ఆలస్యం చేయకుండా నిపుణుల్ని సంప్రదించడం మంచిది. వాళ్లు సూచించే మందులు, క్రీములతో సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్