కరివేపాకు మొక్క సంరక్షణలో..

వంటల్లో విరివిగా వినియోగించే కరివేపాకుతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలెన్నింటినో పొందొచ్చు. ఈ మొక్కను వంటింటి పక్కగా పెరట్లోనే పెంచుకుంటే అంతకంటే ఆ ఇల్లాలికి సంతోషం మరేదీ ఉండదు. కరివేపాకు మొక్కనెలా సంరక్షిస్తూ  పెంచాలో నిపుణులు చెబుతున్నారిలా.

Published : 24 Dec 2022 00:14 IST

వంటల్లో విరివిగా వినియోగించే కరివేపాకుతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలెన్నింటినో పొందొచ్చు. ఈ మొక్కను వంటింటి పక్కగా పెరట్లోనే పెంచుకుంటే అంతకంటే ఆ ఇల్లాలికి సంతోషం మరేదీ ఉండదు. కరివేపాకు మొక్కనెలా సంరక్షిస్తూ  పెంచాలో నిపుణులు చెబుతున్నారిలా.

ఎరువులు.. కరివేపాకు మొక్కను పెంచేందుకు వెడల్పైన తొట్టెను ఎంచుకోవాలి. ఎరువు, కోకోపీ‡ట్‌, మట్టి కలిపిన మిశ్రమంలో కొంచెం ఇసుకను జత చేసిన తర్వాత మొక్కను నాటాలి. మట్టిలో నీరు నిలవ ఉండకుండా చూసుకోవాలిలి. శీతాకాలంలో కరివేపాకు మొక్క ఎదుగుదల తక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌ పూర్తయ్యేవరకూ ఎక్కువగా ఎరువులందించకుండా ఉంటే మంచిది. ఆకు రాలే కాలం దాటిన తర్వాత ఈ మొక్క ఎదుగుదల వేగవంతమవుతుంది. ఈ సమయంలో నైట్రోజన్‌శాతం ఎక్కువగా ఉండే సేంద్రియ ఎరువుని అందించాలి. ఇక, నెలకోసారి లీటరు నీటిలో చెంచా ఎప్సమ్‌ సాల్ట్‌ కలిపి మొక్క మొదళ్లకు అందించాలి. సీవీడ్‌ ఫెర్టిలైజర్‌ మొక్క ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తుంది. అలానే, పుల్లటి మజ్జిగ లేదా పెరుగును పలచగా నీళ్లల్లో కలిపి మొక్కకు అందించినా ఏపుగా పెరుగుతుంది.

శ్రద్ధ పెట్టండిలా... పొడవుగా ఎదుగుతోన్న మొక్క కొమ్మల చిగుర్లను కత్తిరిస్తూ ఉంటే... కొత్త కొమ్మలతో మొక్క మరింత గుబురుగా మారుతుంది. అలాగే పూలు వచ్చినప్పుడు విత్తనాల కోసం మాత్రమే ఆ కొమ్మలనుంచాలి. లేదంటే మొక్క నుంచి వాటిని కత్తిరిస్తే... మరిన్ని కొమ్మలు విస్తరించడానికి అవకాశం ఉంటుంది.

కొత్త మొక్కల కోసం.. లేత, ముదురు కాకుండా మధ్యస్థంగా ఉండే కొమ్మను మొక్క నుంచి విడదీసి ఆకులు దూసి, మూడునాలుగు అంగుళాలు మట్టిలో  నాటాలి. తర్వాత రెండుమూడు వారాలకు వేర్లు వచ్చి కొమ్మ చిగురిస్తుంది. అలాగే విత్తనాలతో మొక్కలు కావాలంటే, పూలు కాయలుగా మారే వరకూ ఉంచాలి. వాటిని ఎరువులేసిన మట్టిలో చల్లి, పైన మట్టి కప్పి నీటిని అందిస్తే మొలకలొస్తాయి. మొక్కని వేరే కుండీలోకి మార్చాలనుకుంటే వేర్లు దెబ్బతినకుండా జాగ్రత్త తీసుకోవాలి.

చీడపీడలకు అడ్డుకట్ట.. మొక్కపై ఫంగస్‌, బ్యాక్టీరియాల ప్రభావం పడినప్పుడు కొంచెం వంటసోడా, వేపనూనె, నీటిని కలిపి చల్లితే ప్రయోజనం కనిపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్