Children: చిట్టి పిల్లలు కళాఖండాలు

మనలో చాలామందికి పిల్లల అల్లరే కనిపిస్తుంది. కానీ ఆ కొంటె మాటలూ, కోతిచేష్టల వెనుక మాటలకు అందని మేధ, కొలతల్లో చెప్పలేనంత ఉల్లాసం దాగి ఉంటాయి. పెద్దయ్యేకొద్దీ చోటుచేసుకునే మాయ, మర్మం, మోసం, లౌక్యం లాంటివేమీ తెలియవు. కానీ దుడుకుతనాలు భరించడం దుర్భరమంటారా? ఊహూ..

Published : 31 May 2023 00:29 IST

నలో చాలామందికి పిల్లల అల్లరే కనిపిస్తుంది. కానీ ఆ కొంటె మాటలూ, కోతిచేష్టల వెనుక మాటలకు అందని మేధ, కొలతల్లో చెప్పలేనంత ఉల్లాసం దాగి ఉంటాయి. పెద్దయ్యేకొద్దీ చోటుచేసుకునే మాయ, మర్మం, మోసం, లౌక్యం లాంటివేమీ తెలియవు. కానీ దుడుకుతనాలు భరించడం దుర్భరమంటారా? ఊహూ.. సూర్యుడి తాపాన్ని సౌర విద్యుత్తుగా మార్చుకున్నట్టు చిన్నారుల అత్యుత్సాహాన్ని సద్వినియోగం చేసుకునే మార్గాల గురించి ఆలోచించమంటున్నారు చైల్డ్‌ సైకాలజిస్టులు. కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. అవేంటంటే..

మీ పెరట్లో లేదా ఇంటి పక్కన పెద్ద రాయి ఉందనుకోండి.. అది అడ్డుగా ఉందని భావించొద్దు. ఆ రాతిమీద మీ చిన్నారిని ఏదైనా బొమ్మ లేదా ఆబ్‌స్ట్రాక్ట్‌ చిత్రం వేయమనండి. అంతే.. దాన్ని సుందర కళా ఖండంలా తీర్చిదిద్దుతారు. ఆ రాతిని హాల్లో అమర్చారంటే చక్కటి షోపీస్‌లా అలరించడం ఖాయం.

ఆనందించే హృదయం ఉండాలే కానీ పిల్లలు గీసే పిచ్చిగీతల్లో కూడా ఆకర్షణ దోబూచులాడుతుంది. కనుక మీ చిన్నారితో గోడ మీద ఏదైనా బొమ్మ వేయమనండి. బొమ్మ బాగుండదేమో, గోడ చెడిపోతుందేమో.. లాంటి భయాలుంటే మూలగదిలో ఒక చిన్న భాగాన్ని ఎంపిక చేసుకోండి. పెయింట్‌ వేశాక కచ్చితంగా మీకు సంతోషం కలుగుతుంది. అవసరమైతే చిన్నచిన్న సలహాలివ్వొచ్చు. ఆనక హాల్లోనో, డ్రాయింగ్‌రూంలోనో గోడ మీద చిత్రం వేయమనండి. ఇలాంటివి పిల్లల మనసును వికసింపచేయడమే కాదు, తమ మీద అమ్మానాన్నలు ఉంచిన నమ్మకంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

పిల్లలను ఎక్కడికి తీసికెళ్లినా అక్కడ దొరికే ప్రకృతి సహజమైన గచ్చకాయల్లాంటివి సేకరించమని చెప్పండి.. ఇలా అలవాటు చేస్తే.. సముద్ర ప్రాంతానికి వెళ్లినప్పుడు రకరకాల, రంగురంగుల గవ్వలూ, ఆల్చిప్పలు, శంఖాలు వంటివి పోగు చేసి దండలు, అలంకరణ వస్తువులు తయారుచేస్తారు. చెట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో చిత్రమైన ఆకులూ, పూలను సేకరించి.. లీఫ్‌ అండ్‌ ఫ్లవర్‌ ఇమేజెస్‌ రూపొందిస్తారు. ప్రకృతి సోయగాలున్నచోట గువ్వలు సందడి చేస్తాయి. ఆ ప్రాంతాల్లో రంగురంగుల పక్షి ఈకలు సేకరించి బొకే తయారుచేస్తారు. ఇలాంటివి గదుల్లో సర్దితే.. ఆ అందమే వేరప్పా!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్