మీ ఇల్లు.. సురక్షితమేనా

వంట చేసేప్పుడు విడుదలయ్యే పొగ, ఇంటి మొక్కలకు కొట్టే పురుగు మందులు, క్యాండిల్స్‌ నుంచి వచ్చే పొగ, వంటింటి పరికరాల్లో పేరుకొనే దుమ్ము.. ఇవన్నీ కాలుష్య కారకాలేనట.

Published : 05 Jan 2023 01:00 IST

వంట చేసేప్పుడు విడుదలయ్యే పొగ, ఇంటి మొక్కలకు కొట్టే పురుగు మందులు, క్యాండిల్స్‌ నుంచి వచ్చే పొగ, వంటింటి పరికరాల్లో పేరుకొనే దుమ్ము.. ఇవన్నీ కాలుష్య కారకాలేనట. దీనికి నిద్రలేమి, ఒత్తిడి వంటివీ తోడైతే ఆరోగ్యంపై దుష్ప్రభావాలు పడతాయంటున్నారు నిపుణులు. కాబట్టి.. ఇంటినీ స్వచ్ఛంగా మలుచుకోమంటున్నారు. అందుకు తోడ్పడే చిట్కాలే ఇవి!

* దుమ్ము భయంతో చాలామంది కిటికీలను బంధించే ఉంచుతారు. దీంతో రూమ్‌ ప్రెష్‌నర్లు, వంట వాసనలు, దుమ్ముతో కూడిన గాలి బయటికి వెళ్లదు. ఫలితంగా ఎన్నో అనారోగ్యాలు తలెత్తుతాయి. అందుకే రోజులో కొద్దిసేపు కిటికీలను తెరవాలి. అప్పుడప్పుడూ కబోర్డులు, డ్రాలనూ తెరిచి ఉంచాలి.

* కార్పెట్లు, రగ్గులపై దుమ్ము తేలిగ్గా చేరుతుంది. వాటిని వారానికోసారైనా శుభ్రం చేస్తుండాలి. డోర్‌మ్యాట్‌ వంటి వాటిని రెండు రోజులకోసారి మారుస్తూ ఉండాలి.

* వంట పూర్తయ్యాకా అయిదు నిమిషాలపాటు ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ను వేసి ఉంచాలి. చిమ్నీ, అవెన్‌, మిక్సీ వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులను వారానికోసారి శుభ్రం చేయడం తప్పనిసరి.

* చెక్క, తర్వగా భూమిలో కలిసిపోయే వాటితో చేసిన ఫర్నిచర్‌కు ప్రాధాన్యమిస్తే.. రసాయనాలు, అవి గాలిలో విడుదలవుతాయన్న భయముండదు. కర్టెన్లు, కార్పెట్‌లు, కుషన్‌ కవర్లు మొదలైన వాటికి మైక్రోబియల్‌ వస్త్రాలను ఉపయోగించడం మేలు. సూక్ష్మజీవులు, కలుషితాల సమస్య ఉండదు.

* ఇంట్లో స్వచ్ఛమైన గాలినిచ్చే మొక్కలకు ప్రాధాన్యమివ్వండి. ఐవీ, స్పైడర్‌ ప్లాంట్‌, వెదురు లాంటివి ఇందుకు ఉత్తమ ఎంపిక. ఎక్కువ స్థలం లేదనిపిస్తే చిన్న మొక్కలతో నిండిన టెరారియమ్స్‌కి ప్రాధాన్యమివ్వొచ్చు. ఇంటికి అందాన్నిస్తాయి.. గాలినీ స్వచ్ఛంగా మారుస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్