పిల్లలు బాగా చదవాలా?

బెడ్‌రూముల్లో, సోఫాలపై, కిచెన్‌లో ఒక పద్ధతి లేకుండా పిల్లలు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చదువుతున్నారా? టీవీ, పెద్దవాళ్ల ముచ్చట్లు, వాదనల మధ్య ఇక వారికి చదివింది ఏం ఒంటపడుతుంది?  వాళ్లకంటూ ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేస్తే ప్రశాంతంగా చదువుకుంటారు..

Published : 24 Mar 2023 00:40 IST

బెడ్‌రూముల్లో, సోఫాలపై, కిచెన్‌లో ఒక పద్ధతి లేకుండా పిల్లలు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చదువుతున్నారా? టీవీ, పెద్దవాళ్ల ముచ్చట్లు, వాదనల మధ్య ఇక వారికి చదివింది ఏం ఒంటపడుతుంది?  వాళ్లకంటూ ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేస్తే ప్రశాంతంగా చదువుకుంటారు..

స్టడీ రూమంటే వారికి ప్రత్యేకంగా ఓ గదినే కేటాయించాలని ఏం లేదు. సరిపడా గదులు ఉన్నప్పుడు ఇలా చేయొచ్చు. కానీ స్థలం సరిపోనప్పుడు ఇబ్బంది పడకుండా ఇలా చేయండి. పిల్లలకు టీవి, ఇంట్లోని శబ్దాలు ఎక్కువగా వినిపించని ఒక స్థలాన్ని ఎంపిక చేసుకోండి. వారి ఎత్తుకు తగ్గట్టు ఒక స్టడీ చైర్‌, టేబుల్‌ని తీసుకోండి.

బ్యాక్‌గ్రౌండ్‌లో హంగులు, ఆర్భాటాలు లేకుండా లేత రంగులున్న వాల్‌ పోస్టర్లను అంటించండి. టేబుల్‌పైకి ఒక చిన్న ల్యాంప్‌ని పెట్టండి. అది మరీ ఎక్కువ వెలుగున్నా కళ్లు దెబ్బతింటాయి. తక్కువ వెలుగుంటే చదువుకోవటానికి ఇబ్బందికరంగా ఉంటుంది.

పిల్లలకు అవసరమైన పెన్సిళ్లు, పెన్నులు వగైరా సామగ్రి అంతా టేబుల్‌పై సర్దండి. వాళ్లకి సంబంధించిన పుస్తకాలన్నింటినీ రోజూ అక్కడే సర్దుకొమ్మని చెప్పండి.

టేబుల్‌పై ఓ పక్కన చిన్న మొక్కను పెట్టండి. దాన్ని చూసినప్పుడల్లా ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా అనిపిస్తుంది. దాని నిర్వహణ  కూడా వారికే అప్పగించండి. చిన్నప్పటినుంచే బాధ్యత అంటే ఏంటో తెలుస్తుందంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్