Home Decoration: ఇంటి వాతావరణాన్ని మార్చేద్దాం

చుట్టూ ఉండే వాతావరణం మన మనసుపైనా ప్రభావం చూపుతుంది. అందుకే ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.

Published : 16 Apr 2023 00:51 IST

చుట్టూ ఉండే వాతావరణం మన మనసుపైనా ప్రభావం చూపుతుంది. అందుకే ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. అందుకోసం పెద్దగా శ్రమ పడాల్సిన పనిలేదు. చిన్న చిన్న మార్పులు చేస్తే సరి. అవేమిటో చూద్దామా...

సుగంధ పరిమళాలతో.. సువాసనలు వెదజల్లే అనేక రకాల కొవ్వొత్తులు, నూనెలు మనకు మార్కెట్లో అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి. లావెండర్‌, పెప్పర్‌మింట్‌ వంటి రకాలు మనసును ఉల్లాసంగా ఉంచుతాయి. ఒత్తిడి తగ్గించి హాయినిస్తాయి.


పోగెయ్యొద్దు.. కొందరు అవసరం లేని వస్తువులను దాచిపెడతారు. వాటిని అవసరం అయిన వాళ్లకు ఇవ్వడమో లేదా పడేయటమో చేయాలి. మిగతా వాటిని క్రమపద్ధతిలో సర్దుకోవాలి. అప్పుడే ఇల్లంతా గజిబిజిగా లేకుండా ప్రశాంతంగా ఉంటుంది.


గాలి, వెలుతురుతో.. దుమ్ము వస్తుందనో, ఏసీ వేశామనో ఎప్పుడూ కిటికీలు, తలుపులూ మూసి ఉంచకూడదు. కనీసం ఉదయం, సాయంకాలం వంటి సమయాల్లోనైనా గాలి, వెలుతురూ ప్రసరించేలా వాటిని తెరచి ఉంచాలి. అప్పుడే ఇల్లంతా ఉత్తేజంగా కనిపిస్తుంది.


మొక్కల పెంపకంతో.. మొక్కలు గాలిని శుద్ధి చేయటమే కాకుండా ఇంట్లోకి కొత్త అందాన్ని తీసుకొస్తాయి. అందుకే నిర్వహణ తేలిగ్గా ఉండే మొక్కలను ఎంచుకొని పెంచితే చాలు.. ఇంటి వాతావరణమే మారిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్