Neck Pain: తల కింద ఎత్తు సరిగా ఉందా..

మెడనొప్పా? వంటగదిలో అదే పనిగా విరామం లేకుండా పనిచేయటం, కంప్యూటర్‌ ముందు ఎక్కువ సమయం కూర్చోవటం, పడుకున్నప్పుడు తలకింద ఎత్తు సరిగా లేకపోవటం ఇలా దీనికి బోలెడు కారణాలు.

Updated : 11 Feb 2024 11:59 IST

మెడనొప్పా? వంటగదిలో అదే పనిగా విరామం లేకుండా పనిచేయటం, కంప్యూటర్‌ ముందు ఎక్కువ సమయం కూర్చోవటం, పడుకున్నప్పుడు తలకింద ఎత్తు సరిగా లేకపోవటం ఇలా దీనికి బోలెడు కారణాలు. తగ్గించుకోవాలంటే..

* మెడ నొప్పి ఉంటే దానితో పాటు తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. నొప్పి ఉన్న ప్రాంతంలో వేడి లేదా చల్లటి నీళ్లతో కాపడం పెట్టొచ్చు. అలా చేస్తే కొంత ఉపశమనం పొందొచ్చు.

* రోజూ తేలికపాటి వ్యాయామాలు చేస్తూ ఉంటే క్రమంగా నొప్పి తగ్గుతుంది. ఫిజియోథెరపీ చేయించుకున్నా మంచిదే.

* మెడనొప్పి ఎక్కువగా అనిపిస్తే పనికి కొంత విరామం ఇవ్వండి. కంప్యూటర్‌ని తదేకంగా చూస్తూ ఉండక మధ్యమధ్యలో నాలుగడుగులు వేయండి. ఒత్తిడి ఎక్కువగా ఉన్నా తలతో పాటు మెడ కూడా నొప్పి వస్తుంది. ఒత్తిడిని తగ్గించేందుకు పాటలు వినడం, ధ్యానం వంటివి చేయాలి.

* స్మార్ట్‌ ఫోను చూసే సమయాన్ని తగ్గించుకోవాలి. ఆఫీసులో మీ కుర్చీ ఎత్తు మీ ఎత్తుకు తగినట్లుగా ఉందా లేదా అనే విషయాన్ని గమనించుకోవాలి. అలాగే పని చేసేటప్పుడు అవసరమైతే మెడకు బెల్టు ధరించండి.

* నిద్రించే సమయంలో తలకింద ఎత్తుని సరిచూసుకోండి. నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ఇంట్లో వారితో మసాజ్‌ చేయించుకోండి. సమస్య తీవ్రంగా బాధిస్తుంటే మాత్రం వైద్యులను సంప్రదించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్