Published : 02/10/2022 14:32 IST

ఎంత నచ్చినా సరే.. మితంగానే..!

పండగల సమయంలో ముఖ్యంగా పిండి వంటల్ని ఆస్వాదించే విషయంలో అస్సలు రాజీపడరు కొంతమంది. ఈ క్రమంలో తమకు నచ్చిన స్వీట్స్‌, డీప్‌ ఫ్రై చేసిన వంటకాల్ని మనసారా ఆస్వాదిస్తుంటారు. ఇవి తినేటప్పుడు బాగానే ఉంటాయి కానీ.. ఆ తర్వాతే అజీర్తి, కడుపుబ్బరం.. వంటి సమస్యలు మొదలవుతాయి. అందుకే ఈ సమయంలో నచ్చినవి మితంగా తీసుకుంటూనే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ క్రమంలో- పండగ సీజన్లో ఇలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం రండి..

✬ ఏదైనా తినే ముందు కొన్ని నీళ్లు తాగడం వల్ల ఎక్కువ తినకుండా జాగ్రత్తపడచ్చు.. శరీరాన్నీ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవచ్చు. అలాగే రోజంతా మధ్యమధ్యలో నీళ్లు తాగుతూ ఉండడం మాత్రం మర్చిపోవద్దు. ఈ క్రమంలో కాఫీ, శీతల పానీయాలు, కాక్‌టెయిల్స్‌.. వంటి వాటికి దూరంగా ఉండాలి.

✬ పండగ సందర్భంగా - స్పెషల్స్ లేకపోతే ఎలా అని వాటిని బయటి నుంచి తెచ్చుకోవడం కాకుండా ఇంట్లోనే తయారుచేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతాం.

✬ వంటకాలు ఎంత బాగున్నా సరే మితంగానే తినాలి.

✬ పండగ రోజు తీసుకున్న ఆహారం వల్ల మన శరీరంలో చేరిన విషతుల్యాలను మరుసటి రోజు తొలగించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. అలాకాకుండా పండగ రోజు కొన్ని పదార్థాలు మిగిలిపోయాయి కదా అవి తీసుకుందాం అనుకుంటే.. అజీర్తి, కడుపుబ్బరం.. వంటి సమస్యలు తప్పవు! ఒకవేళ ఈ సమస్యలు బాధిస్తుంటే గుల్‌కండ్‌ తీసుకోవాలి.

✬ అలాగే పండగైనా సరే- రోజూ చేసే వ్యాయామాలు చేయడం మాత్రం మర్చిపోవద్దు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని