Screen time: స్క్రీన్‌ సమయం తగ్గించుకోవాలా...

ఆఫీసు నుంచి ఇలా బయటకు వచ్చామో లేదో ఫోన్‌లో మునిగిపోతుంటాం. తెలియకుండానే మన సమయమంతా ఇట్టే అయిపోతుంది. ఉన్న సమయాన్ని తెలివిగా ఉపయోగించుకుంటేనే ఏదైనా సాధించగలం.

Published : 29 Apr 2023 00:16 IST

ఆఫీసు నుంచి ఇలా బయటకు వచ్చామో లేదో ఫోన్‌లో మునిగిపోతుంటాం. తెలియకుండానే మన సమయమంతా ఇట్టే అయిపోతుంది. ఉన్న సమయాన్ని తెలివిగా ఉపయోగించుకుంటేనే ఏదైనా సాధించగలం. అందుకు నిపుణులేమంటున్నారో చూద్దామా!

పరిధులు ఏర్పరచుకుంటే.. రోజుకు ఇంత సమయం మాత్రమే చూడాలని నియమం ఏర్పరచుకోండి. ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా ఆ సమయాన్ని తగ్గించుకుంటూ రండి.

ఏకాగ్రతతో.. ఏదైనా ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు ఫోనులో నోటిఫికేషన్లను టర్న్‌ ఆఫ్‌ చేయండి. అప్పుడే అనుకున్న పని పూర్తి ఏకాగ్రతతో చేయగలం.

గదిలోకి ఫోన్‌ వద్దు.. నిద్రపోయే ముందు చాలామందికి ఫోను చూసే అలవాటు ఉంటుంది. దాని బదులు ఏదైనా పుస్తకం చదవటానికి ప్రాధాన్యం ఇవ్వండి.

20/20 నియమం.. ప్రతి 20 నిముషాలకొకసారి మధ్య మధ్యలో బ్రేక్‌ తీసుకోండి. ఆ సమయంలో స్క్రీన్‌ వైపు చూడకుండా కనీసం ఇరవై సెకన్లపాటు మనకు కనిపించేంత దూరంలో ఉన్న ఏదైనా వస్తువు వైపు చూపు మరల్చండి.

కొత్తది నేర్చుకోండి.. ఫోను చూసే సమయం తగ్గించుకోవాలంటే ఏదో ఒక వ్యాపకం అలవాటు చేసుకోండి. చిత్రలేఖనం, సంగీతం, కొత్త భాష ఇలా ఏదో ఒకటి అలవాటు చేసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని