ఇలా చేస్తే ఎండల్లోనూ ఫ్రెష్‌గానే ఉండచ్చు!

వేసవిలో ఎండల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓవైపు నడినెత్తిన సూర్యుడు తాండవం చేస్తుంటే మరోవైపు ఎడతెగని ఉక్కపోత, చెమటలతో సతమతమవుతుంటాం. అయితే వేసవిలో తలెత్తే ఈ పరిస్థితుల నుంచి చర్మాన్ని జాగ్రత్తగా సంరక్షించుకుంటేనే తాజాగా, అందంగా......

Updated : 15 Mar 2022 16:14 IST

వేసవిలో ఎండల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓవైపు నడినెత్తిన సూర్యుడు తాండవం చేస్తుంటే మరోవైపు ఎడతెగని ఉక్కపోత, చెమటలతో సతమతమవుతుంటాం. అయితే వేసవిలో తలెత్తే ఈ పరిస్థితుల నుంచి చర్మాన్ని జాగ్రత్తగా సంరక్షించుకుంటేనే తాజాగా, అందంగా కనిపించడం సాధ్యమవుతుందంటున్నారు సౌందర్య నిపుణులు. మరి ఇందుకు ఉపకరించే కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం రండి..

రోజ్‌వాటర్ కలిపితే..

వేసవిలో స్నానం చేసిన తర్వాత అధిక సమయం తాజాగా కనిపించాలంటే ఒక బకెట్ నీటిలో నాలుగు చెంచాల రోజ్‌వాటర్ కలపాలి. ఇలా చేయడం వల్ల అధిక చెమట సమస్య నుంచి విముక్తి లభించడం మాత్రమే కాకుండా తాజాగా, పరిమళభరితంగా కూడా అనిపిస్తుంది. అలాగే స్నానానంతరం చర్మం తుడుచుకునే క్రమంలో కూడా మెత్తని వస్త్రంతో అద్దుకుంటూ తుడుచుకోవాలి. అంతేకానీ.. బలంగా రుద్దకూడదు. అలా చేయడం వల్ల చర్మం వదులుగా మారి ముడతలు పడడమే కాకుండా ర్యాషెస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. గాలి వెళ్లని ప్రదేశాల్లో టాల్కం పౌడర్ వేసుకోవడం వల్ల చెమట కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.

వేసవిలో మేకప్ వీలైనంత తక్కువ వేసుకోవాలి. అయితే మేకప్ వేసుకునే ముందు ఐస్‌క్యూబ్‌తో ముఖం, మెడ చుట్టూ మృదువుగా రుద్దాలి. చర్మఛాయకు నప్పేలా కాంపాక్ట్ పౌడర్ అప్త్లె చేసుకోవాలి. కావాలనుకుంటే లైట్ పింక్ షేడ్‌తో ఐ షాడో వేసుకోవచ్చు. వాటర్‌ప్రూఫ్ ఐ లైనర్, మస్కారా.. పెట్టుకుంటే సహజసిద్ధమైన లుక్‌తోనే అందంగా మెరిసిపోవచ్చు.

ఈ ప్యాక్‌తో ప్రకాశవంతంగా...

అయితే వేసవిలో బయటకు వెళ్లినప్పుడు చర్మం అలసిపోయినట్లు మారడమే కాకుండా ట్యాన్ సమస్య కూడా కనిపిస్తుంది. వీటి నుంచి విముక్తి పొందుతూ చర్మానికి చల్లదనాన్ని అందించి, ప్రకాశవంతంగా కనిపించేలా చేసే ఈ ప్యాక్ ప్రయత్నించి చూడండి.

కావాల్సినవి:

పుచ్చకాయ రసం (ముఖానికి సరిపడినంత)

బార్లీ పొడి- సరిపడినంత

ఈ రెండింటినీ కలిపి ముఖం నుంచి చేతుల వరకు ప్యాక్‌లా అప్త్లె చేసుకొని 15 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం చల్లబడి తాజాగా కనిపించడమే కాకుండా ప్రకాశవంతంగా కూడా మారుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్