ఆ చీరలతో.. ఇంట్లోనూ పెరిగే అందం!
మీ ఇంట్లో పాత చీరలు బోలెడన్ని ఉన్నాయా? సగం వార్డ్రోబ్ వాటితోనే నిండిపోయిందా? మరి వాటిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? 'ఏముంది.. పడేయడమో.. లేదంటే వస్తువులు తుడవడానికి ఉపయోగించడమో చేస్తాం..' అంటారా. అయితే ఒక్క క్షణం ఆగండి. పాత చీరలతో పాటు నచ్చకుండా పక్కన పడేసిన....
మీ ఇంట్లో పాత చీరలు బోలెడన్ని ఉన్నాయా? సగం వార్డ్రోబ్ వాటితోనే నిండిపోయిందా? మరి వాటిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? 'ఏముంది.. పడేయడమో.. లేదంటే వస్తువులు తుడవడానికి ఉపయోగించడమో చేస్తాం..' అంటారా. అయితే ఒక్క క్షణం ఆగండి. పాత చీరలతో పాటు నచ్చకుండా పక్కన పడేసిన కొన్ని చీరలు కూడా మన దగ్గర ఉంటాయి. అలాంటి వాటితో ఇంటిని వివిధ రకాలుగా అలంకరించచ్చు. తక్కువ బడ్జెట్లోనే ఇంటికి ఆకర్షణీయమైన లుక్‌ని తీసుకురావచ్చు. మరి, అదెలా అంటారా?
కర్టెన్లు.. ఆకట్టుకునేలా!
కట్టుకోకుండా మూల పడేసిన చీరలు లేదంటే నెట్టెడ్ చీరల్ని ఇంట్లో కర్టెన్ల లాగా కూడా వాడుకోవచ్చు. వాటిలో కాస్త ఆకర్షణీయమైన రంగులో ఉన్న చీరల్ని ఇంటి కిటికీ, ద్వారానికి సరిపడా కొలిచి.. వాటికి అపోజిట్ రంగులో ఉన్న చీరలతో కర్టెన్ పైభాగంలో ప్యాచెస్ లాగా అంటిస్తే దానికి మరింత అందాన్ని జోడించినవారవుతారు. అయితే ఈ క్రమంలో గదిలో ఉన్న కిటికీలు, తలుపులన్నింటికీ ఒకే తరహా కర్టెన్లు అమర్చడానికి ఒక చీర సరిపోకపోవచ్చు. కాబట్టి అపోజిట్ రంగులు, దగ్గరగా ఉండే రంగులున్న చీరల్ని ఒకే గది కోసం ఎంపిక చేసుకుంటే బాగుంటుంది.
వాల్ ఫ్రేములుగా..
హాల్, బెడ్రూమ్స్.. వంటి ప్రదేశాల్లో గోడలకు పెద్ద పెద్ద వాల్ ఫ్రేములు అమర్చడం మనకు తెలిసిందే. ఈ క్రమంలో- వాడకుండా పక్కన పడేసిన చీరల్ని ఇంటి అలంకరణలో ఉపయోగించే వాల్ ఫ్రేములుగా, ఫొటో ఫ్రేములుగా కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ ఫొటోలకు బదులుగా ఫ్రేముల్లో చీరలు అమర్చాల్సి ఉంటుంది. ఇలాంటివన్నీ క్రమపద్ధతిలో అమర్చితే చూడడానికి చాలా బాగుంటుంది. ఇందుకోసం కూడా అపోజిట్ రంగులున్న చీరల్ని ఎంపిక చేసుకుంటే ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
మరింత ఆకర్షణీయంగా..
వాడకుండా మూల పడేసిన చీరల్లో కొన్ని ఆకర్షణీయమైన రంగులు, డిజైన్లతో కూడుకున్న వాటిని ఎంచుకొని వాటితో దిండ్లకు, కుషన్లకు కవర్లలా కుట్టించచ్చు. అలాగే చీరల్లోని బార్డర్లను ఆ కవర్లకు నలు చివర్లలో వచ్చేలా కుట్టిస్తే.. అవి మరింత ఆకర్షణీయంగా తయారవుతాయి. గదికి కూడా సరికొత్త కళను తీసుకొస్తాయి. వీటితో పాటు కాటన్ చీరలన్నీ కలిపి క్విల్ట్ లాగా కూడా తయారుచేయించచ్చు. ఇలా చీరలతో తయారైన క్విల్ట్, దిండ్లకు తొడిగిన కవర్లను మంచంపై పరిస్తే చూడడానికి అందంగా కనిపిస్తుంది. కావాలంటే మీరూ ఓసారి ప్రయత్నించి చూడండి.
లుక్ పెరగాలంటే..
ఇంట్లో ఉండే వివిధ వస్తువుల పైన దుమ్ము పడకుండా కప్పడానికి వివిధ రకాల కవర్లను కొంటుంటాం. ఇంత చిన్న వాటికి కూడా డబ్బులు ఖర్చు పెట్టడం కంటే ఇంట్లో వాడకుండా మూల పడేసిన చీరలని ఉపయోగించడం మంచిది. ఫలితంగా బడ్జెట్ కూడా కలిసొస్తుంది. ఆకర్షణీయమైన రంగుల్లో ఉండే చీరల్ని ఎంపిక చేసుకొని మీరు ఏ వస్తువు పైన కప్పాలనుకుంటున్నారో దాని కొలత తీసుకొని వివిధ డిజైన్లలో కుట్టిస్తే సరిపోతుంది. ఈ క్రమంలో కుచ్చులుకుచ్చులుగా, ప్యాచెస్‌లా.. ఇలా పలు రకాలుగా కుట్టించి వాటిపై అమర్చితే చూడడానికి మంచి లుక్ వస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!