స్వీట్ థర్టీస్.. అందంగా, ఆకర్షణీయంగా!
మీ వయసెంత? ఇరవైలు దాటి ముప్ఫైల్లోకి అడుగు పెట్టేస్తున్నారా? వయసు పెరగడం అనేది అనివార్యం. తలకిందులుగా తపస్సు చేసినా దానిని ఆపలేం. కానీ ఎదిగే వయసును ఆపలేకపోయినా-కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం తక్కువ వయస్సు....
మీ వయసెంత? ఇరవైలు దాటి ముప్ఫైల్లోకి అడుగు పెట్టేస్తున్నారా? వయసు పెరగడం అనేది అనివార్యం. తలకిందులుగా తపస్సు చేసినా దానిని ఆపలేం. కానీ ఎదిగే వయసును ఆపలేకపోయినా-కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం తక్కువ వయస్సు వారిలా కనిపించవచ్చు. మునుపటిలా అందంగా, ఆకర్షణీయంగానే ఉండచ్చు. మరి ఆ చిట్కాలేంటో పాటించి మీరూ 'స్వీట్ థర్టీస్' అయిపోతారా?
⚛ రోజూ ఎనిమిది గంటలు నిద్రపోండి. నిద్రను మించిన సౌందర్య సాధనం లేదు.
⚛ ఉదయం వేళ కొద్దిసేపైనా ఆరు బయట ఎండ తగిలేలా పని చేయండి. వ్యాయామం చేస్తే ఇంకా మంచిది. దీనితో విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుంది. తద్వారా ఎముకలు దృఢంగా ఉంచుకోవచ్చు.
⚛ రోజూ ఎనిమిది గ్లాసుల నీళ్ళు తాగండి. ఇది చర్మ నిగారింపుకి తోడ్పడుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది. శరీరంలోని అన్ని సమస్యలకు ఇది పరిష్కారం చూపుతుందనడంలో అతిశయోక్తి లేదు. నీరు అధికంగా తీసుకోండని సెలబ్రిటీలు ఎందుకు సలహాలిస్తారో ఇప్పుడు అర్ధమయింది కదూ.!
⚛ సన్‌స్క్రీన్ లోషన్ వాడకుండా అడుగు బయట పెట్టకండి. నిత్యం దీనిని వాడటం వల్ల ట్యానింగ్ బారి నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. అలాగే మాయిశ్చరైజర్ కూడా వాడండి. అప్పుడే చర్మం తేమగా, పొడిబారకుండా ఉంటుంది.
⚛ నిద్రకు ఉపక్రమించే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. మేకప్‌తో ఎట్టి పరిస్థితుల్లో నూ నిద్రించకూడదు.
⚛ వ్యాయామం, యోగా లాంటి వాటిని మీ దినచర్యలో ఓ భాగం చేసుకోండి. ఈ కసరత్తులతో రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాకుండా చక్కటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.
⚛ క్రమం తప్పకుండా బరువు చూసుకోండి. అలాగే అవసరమైన వైద్య పరీక్షలు (మమోగ్రామ్, పాప్‌స్మియర్ వంటివి) చేయించుకోండి. తద్వారా ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవచ్చు. బరువు పెరుగుదలకు సంబంధించి కూడా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది.
⚛ తల్లిదండ్రులతో, బంధుమిత్రులతో తరచుగా మాట్లాడుతూ ఉండండి. వాళ్ళ బాగోగులను అడిగి తెలుసుకోండి. మనసు విప్పి మాట్లాడండి.
⚛ రెండు మూడు నెలలకోసారైనా మసాజ్ చేయించుకోండి. అది మీ శరీరతత్వానికి సరిపడేదిగా ఉండాలి. శరీర కండరాలకు చక్కటి ఉపశమనం లభిస్తుంది. నొప్పులూ గిప్పులూ ఉంటే పరారైపోతాయి. శరీరానికి, మనసుకి చక్కటి రిలాక్సేషన్ లభిస్తుంది.
⚛ ఇప్పుడు సమస్త సమాచారం అర చేతిలోనే లభిస్తోంది. సాధ్యమైనన్ని మార్గాల ద్వారా వివిధ అంశాల గురించి మీ విజ్ఞానం పెంచుకోండి.
చివరగా - రోజూ కనీసం ఓ గంటైనా ఫోన్‌ను పక్కన బెట్టండి. సోషల్ మీడియానే ప్రపంచంగా భావించకండి. ఆ సమయాన్ని ఓ మంచి పుస్తకం చదవడానికో, మీ కుక్క పిల్లతో గడపడానికో కేటాయించండి. మీకిష్టమైన డిష్‌ను ఆరగించండి. ఆ తర్వాతే ఇన్స్టాగ్రామ్ అయినా.. మరేదైనా!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అతను తగినవాడేనా?
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!