కప్పులు, సాసర్లు.. పదిలంగా..!
వంటింట్లో కొన్ని వస్తువులు, పాత్రల్ని చాలా జాగ్రత్తగా అమర్చుకోవాల్సి ఉంటుంది. వాటిలో పింగాణీ పాత్రలు ఒకటి. ఈ క్రమంలో మనం నిత్యం వాడే కప్పులు, సాసర్లను అన్ని పాత్రలతో పాటే శుభ్రం చేయడం, భద్రపరచడం వల్ల అవి పగిలిపోయే అవకాశం....
వంటింట్లో కొన్ని వస్తువులు, పాత్రల్ని చాలా జాగ్రత్తగా అమర్చుకోవాల్సి ఉంటుంది. వాటిలో పింగాణీ పాత్రలు ఒకటి. ఈ క్రమంలో మనం నిత్యం వాడే కప్పులు, సాసర్లను అన్ని పాత్రలతో పాటే శుభ్రం చేయడం, భద్రపరచడం వల్ల అవి పగిలిపోయే అవకాశం ఎక్కువ. ఈ సమస్య లేకుండా ఉండేందుకే ప్రస్తుతం కప్/సాసర్ ర్యాక్స్, హోల్డర్స్ మార్కెట్లోకొచ్చేశాయి.
ఎక్కడంటే అక్కడ అమర్చుకునేలా స్టాండ్ మాదిరిగా, గోడకు వేలాడదీసేలా, ర్యాక్స్‌కి అనుసంధానం చేసుకునేలా, ఒకదానిపై ఒకటి పేర్చుకునేలా, బోర్లించుకునేలా.. ఇలా విభిన్న డిజైన్లతో కూడిన కప్ హోల్డర్స్ అతివల్ని ఆకర్షిస్తున్నాయి. ఇంటికి అతిథులొచ్చినప్పుడు టీ కెటిల్‌తో పాటు ఈ స్టాండ్‌నీ వారి వద్దకే తీసుకెళ్లి.. సర్వ్ చేసుకోవచ్చు. మరి, అలాంటి ముచ్చటైన కప్, సాసర్ స్టాండ్స్‌పై మీరూ ఓ లుక్కేయండి!
Photos: Amazon.in
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.