ఈ టేస్టీ ఫ్రైస్.. రుచి చూశారా?
చల్లని వాతావరణంలో ఏదైనా వేడివేడిగా, కారంకారంగా ఉండే స్నాక్స్ తినాలనిపించడం సహజం. అలాంటి సందర్భాల కోసమే ఈ 'కీరదోస ఫ్రైస్'! క్రిస్పీగా ఉండే వీటిని చూడగానే ఇట్టే లాగించేయాలనిపిస్తుంది. అంతేకాదు.. వీటితో బోలెడంత ఆరోగ్యం....
చల్లని వాతావరణంలో ఏదైనా వేడివేడిగా, కారంకారంగా ఉండే స్నాక్స్ తినాలనిపించడం సహజం. అలాంటి సందర్భాల కోసమే ఈ 'కీరదోస ఫ్రైస్'! క్రిస్పీగా ఉండే వీటిని చూడగానే ఇట్టే లాగించేయాలనిపిస్తుంది. అంతేకాదు.. వీటితో బోలెడంత ఆరోగ్యం కూడా సొంతం చేసుకోవచ్చు.
కావాల్సినవి
❀ కీర దోసకాయ - 1
❀ వెల్లుల్లి పొడి - అర టీస్పూన్
❀ కారం - అర టీస్పూన్
❀ ఉప్పు - కొద్దిగా
❀ మిరియాల పొడి - రుచికి సరిపడా
❀ కొత్తిమీర తరుగు - కొద్దిగా
❀ ఆలివ్ నూనె - అర టీస్పూన్
❀ శెనగపిండి - 1 కప్పు
❀ పాలు - అర కప్పు
❀ బ్రెడ్ క్రంబ్స్ - 1 కప్పు
తయారీ
మొదట కీర దోసకాయను ఫ్రెంచ్ ఫ్రైస్‌లా నిలువుగా కట్ చేయాలి. వాటిని ఒక బౌల్‌లోకి తీసుకుని.. అందులో వెల్లుల్లి పొడి, కారం, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు, ఆలివ్ నూనెలను కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్‌లో శెనగపిండికి ఉప్పు, మిరియాల పొడి, పాలు కలిపి దోసె బ్యాటర్‌లా తయారుచేసుకోవాలి. ఆపై ఒక ప్లేట్‌లో బ్రెడ్ క్రంబ్స్‌కి ఉప్పు, మిరియాల పొడిని కలిపి సిద్ధం చేసుకోవాలి. బౌల్‌లో కలిపి ఉంచుకున్న కీరదోస ముక్కల్ని శెనగపిండి బ్యాటర్‌లో ముంచి.. ఆపై సిద్ధంగా ఉన్న బ్రెడ్ క్రంబ్స్‌పై దొర్లించాలి. ఇలా కీరదోస ముక్కలన్నింటినీ సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని నూనె రాసిన ఓ బేకింగ్ ట్రేలో కాస్త గ్యాప్ ఉండేలా పేర్చుకొని.. ఈ ట్రేని ఒవెన్‌లో పెట్టి 180 డిగ్రీల వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే 'కీర దోస ఫ్రైస్' రడీ.. వీటిని ఏదైనా చట్నీ లేదా కెచప్‌లో డిప్ చేసుకొని లాగించేస్తే మస్త్ మజాగా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.