బరువు తగ్గించే ఏబీసీ

ఆరోగ్యంగా బరువు తగ్గాలి.. ఇదే చాలామంది మంత్రం అవుతోంది. ఈ ఏడాది ఎక్కువమంది ఆసక్తి చూపిన వాటిల్లో ‘ఏబీసీ జ్యూస్‌’ ఒకటి. తారలూ ప్రయత్నించిన దీని సంగతేంటో మీరూ చూసేయండి.

Published : 30 Dec 2022 00:36 IST

ఆరోగ్యంగా బరువు తగ్గాలి.. ఇదే చాలామంది మంత్రం అవుతోంది. ఈ ఏడాది ఎక్కువమంది ఆసక్తి చూపిన వాటిల్లో ‘ఏబీసీ జ్యూస్‌’ ఒకటి. తారలూ ప్రయత్నించిన దీని సంగతేంటో మీరూ చూసేయండి.

* ఆపిల్‌, బీట్‌రూట్‌, క్యారెట్‌లతో చేసింది కనుక దీనికి ‘ఏబీసీ’ జ్యూస్‌ అని పేరు. ఈ మూడింటినీ సమపాళ్లలో తీసుకొని ఒక గ్లాసు ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకోవాలి.

* ఆపిల్‌లో పోషకాలు మెండు. ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి గుండెజబ్బులు, కొన్నిరకాల క్యాన్సర్లనీ దరిచేరనీయవు.

* బీట్‌రూట్‌లో ఉండే గుణాలు డీటాక్సిఫై చేసి శరీరంలోని మలినాలను బయటకు పంపేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉంచుతాయి.

*  కెరొటినాయిడ్స్‌, విటమిన్లు, ఫైబర్‌.. క్యారెట్‌ ద్వారా అధిక మోతాదులో అందుతాయి. యాంటీ ఆక్సిడెంట్లూ, మినరల్స్‌.. శరీరం నుంచి టాక్సిన్లను బయటికి పంపడంలో సాయపడతాయి.

ఈ మూడూ శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తూనే మలినాలను బయటికి పంపేస్తాయి. వీటిల్లోని ఫైబర్‌ కడుపు నిండిన భావన కలిగించి త్వరగా ఆకలి కలిగించవు. కెలోరీలూ తక్కువే. అయితే రోజంతా దీనిపైనే పూర్తిగా ఆధారపడొద్దు అంటారు నిపుణులు. దీంతోపాటు తక్కువ కార్బొహైడ్రేట్లు, ఫ్యాట్‌, ప్రొటీన్‌ ఉండే బ్యాలెన్స్‌డ్‌ డైట్‌నీ తీసుకోవడం తప్పనిసరట. ప్రయత్నించేయండి మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్