ఈ స్కాలర్‌షిప్‌ అమ్మాయిలకు మాత్రమే..!

జీవితంలోని చీకట్లను తరిమేసి వెలుగును నింపే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది. కానీ, ఇప్పటికీ ఆర్థిక పరిస్థితుల అనుకూలించక చదువుకు దూరమయ్యే అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటివారికి మేమున్నామంటూ సహాయం అందిస్తోంది ‘యు-గో’ అనే స్వచ్ఛంద...

Published : 15 Nov 2022 19:59 IST

జీవితంలోని చీకట్లను తరిమేసి వెలుగును నింపే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది. కానీ, ఇప్పటికీ ఆర్థిక పరిస్థితుల అనుకూలించక చదువుకు దూరమయ్యే అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటివారికి మేమున్నామంటూ సహాయం అందిస్తోంది ‘యు-గో’ అనే స్వచ్ఛంద సంస్థ. ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయిలకు స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుత విద్యాసంవత్సరానికి ‘గివ్‌ఇండియా’తో కలిసి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

‘యు-గో’ అనేది కాలిఫోర్నియాకు చెందిన స్వచ్ఛంద సంస్థ. తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో విశ్వవిద్యాలయాల సంఖ్య కూడా తక్కువగానే ఉంటుంది. అందువల్ల కొద్దిమందికి మాత్రమే చదువుకునే అవకాశం వస్తుంది. ఇలాంటి సమయాల్లో అబ్బాయిలకే ఎక్కువ అవకాశాలు ఇస్తుంటారు. ఫలితంగా అమ్మాయిలు వెనకబడుతుంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా లింగ అసమానతలకు దారి తీస్తుంటుంది. అమ్మాయిలకు విద్యనందించడమే దీనికి సరైన పరిష్కారం అంటోంది యు-గో సంస్థ. ఈ క్రమంలో ఏడు దేశాల్లోని ఆర్థికంగా వెనకబడిన అమ్మాయిలకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చి వారిని ప్రోత్సహిస్తోంది. దీనిద్వారా మొదట అమ్మాయిలు, ఆ తర్వాత వారి కుటుంబం, ఆ తర్వాత అక్కడి ప్రజలు లబ్ధి పొందుతారని అంటోంది. ఇందులో భాగంగానే మన దేశంలోని అమ్మాయిలకు స్కాలర్‌షిప్‌లు అందివ్వడానికి తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 30 చివరి తేదీ. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా...

అర్హతలు:

⚛​​​​​​​ టీచింగ్‌, నర్సింగ్‌, ఫార్మసీ, మెడిసిన్‌, ఇంజినీరింగ్‌.. వంటి ప్రొఫెషనల్‌ డిగ్రీ చదివే అమ్మాయిలు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు.

⚛​​​​​​​ ప్రస్తుత విద్యా సంవత్సరంలో రెగ్యులర్‌ డిగ్రీ కోర్సులో నమోదు చేసుకుని ఉండాలి. దీనికి సంబంధించిన ఫ్రూఫ్‌ (రుసుము చెల్లించిన రశీదు, అడ్మిషన్ లెటర్‌, ఐడీ కార్డు, బోనఫైడ్‌ సర్టిఫికెట్‌)ను జతచేయాల్సి ఉంటుంది.

⚛​​​​​​​ టెన్త్‌, ఇంటర్‌లో 70శాతం మార్కులు వచ్చి ఉండాలి.

⚛​​​​​​​ అన్ని వనరుల ఆదాయం కలుపుకొని సంవత్సరానికి 5 లక్షలకు మించకూడదు.

⚛​​​​​​​ పాన్‌ ఇండియా వ్యాప్తంగా ఉన్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రయోజనాలు:

⚛​​​​​​​ టీచింగ్‌ కోర్సు చదివే అమ్మాయిలకు సంవత్సరానికి 40 వేల రూపాయల చొప్పున రెండు సంవత్సరాల పాటు అందిస్తారు.

⚛​​​​​​​ నర్సింగ్‌, ఫార్మసీ కోర్సులు చదివే విద్యార్థినులకు సంవత్సరానికి 40 వేల రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాల పాటు అందిస్తారు.

⚛​​​​​​​ ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ చదివే అమ్మాయిలకు సంవత్సరానికి 60 వేల చొప్పున నాలుగు సంవత్సరాల పాటు అందిస్తారు.

ఈ స్కాలర్‌షిప్‌కు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ కింది లింక్‌ ద్వారా నేరుగా అప్లై చేసుకోవచ్చు.

https://www.buddy4study.com/page/ugo-scholarship-program

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని