ఉపాసన సీమంతం.. తారలు మెరిసిన వేళ..!
ఉపాసన, రామ్‌చరణ్ దంపతులు త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో- ఇరువురి కుటుంబాలు పుట్టబోయే బిడ్డ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. తమ సంతోషాన్ని బంధువులు, సన్నిహితులతో...
(Photos: Twitter)
ఉపాసన, రామ్‌చరణ్ దంపతులు త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో- ఇరువురి కుటుంబాలు పుట్టబోయే బిడ్డ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. తమ సంతోషాన్ని బంధువులు, సన్నిహితులతో పంచుకుంటూ ప్రత్యేకంగా సీమంతం వేడుకలు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో- తాజాగా మరోసారి హైదరాబాద్‌లో ఉపాసన సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. ఉపాసన, రామ్‌చరణ్ కుటుంబ సభ్యులతో పాటు అల్లు అర్జున్, మంచు లక్ష్మి, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తదితరులు హాజరైన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మరి వాటి పైన మీరూ ఓ లుక్కేయండి..!
ఇదే సరైన సమయం!
ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి అయిన ఉపాసన.. మాతృత్వం గురించి మాట్లాడుతూ- 'మనకు సంబంధించిన విషయాల్లో మనకంటే ఎక్కువ ఆతృత ఈ సమాజానికే ఉంటుంది. అది పిల్లల విషయంలో కావచ్చు.. లేదంటే మరేదైనా వ్యక్తిగత విషయం కావచ్చు. అన్నీ తమకు నచ్చినట్లుగా, తాము కోరుకున్నట్లుగా జరగాలనుకునే వారు మన చుట్టూ ఎక్కువగా ఉంటారు. ఈ క్రమంలో- ఎలాంటి ఒత్తిళ్లకు లోనవకుండా మేము కోరుకున్నప్పుడు తల్లిదండ్రులమవుతున్నందుకు నేను, చెర్రీ చాలా ఆనందంగా ఉన్నాం. ఇద్దరం కలిసి తీసుకున్న మంచి నిర్ణయాల్లో ఇదీ ఒకటి. మా పదేళ్ల వైవాహిక జీవితంలో పిల్లల్ని ఆహ్వానించడానికి ఇదే సరైన సమయమనిపించింది. ఎందుకంటే ఇద్దరం మా రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నాం. ఆర్థికంగానూ ఎదిగాం.. కాబట్టి మాకు పుట్టబోయే పిల్లల్ని బాగా చూసుకుంటామన్న పూర్తి నమ్మకం కలిగాకే ఈ నిర్ణయం తీసుకున్నాం..’ అంటూ ఓ సందర్భంలో పంచుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.