Yoga Gadgets : వీటితో యోగా.. ఈజీగా..!

ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను ఏకకాలంలో అందించే సాధనం యోగా. అయితే ఇందులోనూ కొన్ని యోగాసనాలు చేయడానికి సులభంగా ఉంటే.. మరికొన్ని విభిన్న భంగిమల్లో కష్టతరంగా అనిపిస్తుంటాయి. ఇలాంటి కఠినతరమైన యోగాసనాలు కూడా సులభంగా.....

Published : 21 Jun 2022 17:34 IST

ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను ఏకకాలంలో అందించే సాధనం యోగా. అయితే ఇందులోనూ కొన్ని యోగాసనాలు చేయడానికి సులభంగా ఉంటే.. మరికొన్ని విభిన్న భంగిమల్లో కష్టతరంగా అనిపిస్తుంటాయి. ఇలాంటి కఠినతరమైన యోగాసనాలు కూడా సులభంగా చేసేందుకు వీలుగా ప్రస్తుతం విభిన్న రకాల గ్యాడ్జెట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగిస్తే చకచకా యోగాసనాలు వేయడం పూర్తవుతుంది.. మనం అనుకున్న ఫలితమూ దక్కుతుంది. ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ సందర్భంగా అలాంటి కొన్ని యోగా గ్యాడ్జెట్స్‌ గురించి తెలుసుకుందాం..!

యోగా వీల్‌

యోగాసనాల్లో భాగంగా శరీరాన్ని సునాయాసంగా వెనక్కి, ముందుకు వంచుతూ.. కాళ్లు మాత్రమే కాస్త పైకి లేపుతూ చేసే కొన్ని భంగిమలుంటాయి. ఇలాంటివి చేసేటప్పుడు నడుము, వెన్నెముకను బ్యాలన్స్‌ చేయడం ముఖ్యం. ఇందుకోసం యోగా వీల్‌ చక్కగా ఉపయోగపడుతుంది. ఫొటోలో మాదిరిగా గుండ్రంగా ఉండే ఈ వీల్‌ పైభాగంలో యాంటీస్లిప్‌ మెటీరియల్‌ అతికించి ఉంటుంది. తద్వారా అటూ ఇటూ కదలకుండా నడుముకు పూర్తి సపోర్ట్‌ని అందిస్తుంది. ఇందులోనూ వేర్వేరు సైజుల్లో ఉన్నవి దొరుకుతున్నాయి. కాస్త చిన్న సైజులో ఉన్నవైతే పాదాలు, కాళ్ల వెనక భాగంలో ఉపయోగించుకోవచ్చు. కాబట్టి చేసే యోగాసనాన్ని బట్టి సరైన పరిమాణంలో ఉన్న యోగా వీల్‌ను ఎంచుకోవడం ముఖ్యం.


Calf Stretcher

కొన్ని భంగిమల్లో పాదాలు, కాళ్ల వెనక భాగాల్ని నిర్దేశిత కోణాల్లో వంచుతూ యోగా చేయాల్సి ఉంటుంది. మరికొన్ని సార్లు కుర్చీలో కూర్చొనే పాదాలతో ఎక్సర్‌సైజ్‌ చేస్తుంటాం.. కాళ్లకు ఎలాంటి సపోర్ట్‌ లేకుండా ఈ తరహా వ్యాయామాలు చేయడం కాస్త కష్టమే! అదే Calf Stretcher ఉంటే అది సులువవుతుంది. మన పాదాల్ని ఎంత కోణంలో వంచాలనుకుంటున్నామో సెట్‌ చేసుకునేందుకు వీలుగా ఈ గ్యాడ్జెట్‌లో అమరిక ఉంటుంది. అలాగే పాదాలు పెట్టుకునే ప్రదేశంలో ఆక్యుపంక్చర్‌ ప్రెజర్‌ పాయింట్స్‌ ఉంటాయి. వీటిపై ఒత్తిడి పడి.. ఆయా శరీర భాగాలకు ఆరోగ్యం చేకూరుతుంది. ఇలా రెండు రకాలుగా ఈ గ్యాడ్జెట్‌ మనకు ఉపయోగపడుతుంది.


నీ-ప్యాడ్‌ కుషన్స్‌

కొన్ని యోగాసనాలు వేసే క్రమంలో మోచేతులు, అరచేతులు, మోకాళ్లపై ఒత్తిడి పడుతుంది. తద్వారా ఒక్కోసారి అసౌకర్యంగా ఫీలవుతుంటాం. దీనివల్ల చేసే భంగిమ కూడా ఎక్కువ సమయం కొనసాగించలేం. అలాంటప్పుడు నీ-ప్యాడ్‌ కుషన్స్‌ చక్కటి ప్రత్యామ్నాయం. పేరుకు తగ్గట్లే మెత్తగా, సున్నితంగా ఉండే వీటిని ఆసనాలు వేసేటప్పుడు మోకాళ్లు, మోచేతులు, అరచేతుల అడుగు భాగంలో ఉపయోగించడం వల్ల సులభంగా వ్యాయామం చేసేయచ్చు. ఇక వీటి అడుగుభాగంలో యాంటీస్లిప్‌ మెటీరియల్‌ అతికించి ఉంటుంది.. కాబట్టి స్లిప్‌ అవుతామేమోనన్న భయం ఉండదు.


యోగా సర్కిల్‌ స్ట్రెచ్‌

కొన్ని రకాల యోగాసనాల్లో శరీరాన్ని, చేతులు, కాళ్లను సాగదీస్తూ వ్యాయామం చేయాల్సి వస్తుంది. మరికొన్నిసార్లు వెనక నుంచి వంచిన కాళ్లను చేతులతో అందుకోవాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు ‘యోగా సర్కిల్‌ స్ట్రెచ్‌’ చక్కగా ఉపయోగపడుతుంది. కర్వీ రింగ్‌ మాదిరిగా ఉండే దీని ద్వారా ఆయా యోగాసనాల్ని సులువుగా, సౌకర్యవంతంగా చేయచ్చు. అలాగే కొన్ని భంగిమల్లో మెడ, నడుము.. వంటి కర్వీగా ఉండే భాగాలకు సపోర్ట్‌గానూ దీన్ని వాడుకోవచ్చు.


యోగా సాక్స్‌-గ్లోవ్స్‌

ఎలాంటి వ్యాయామం చేసేటప్పుడైనా, ఆసనం వేసేటప్పుడైనా చెమటలు పట్టడం సహజం. తద్వారా ఎంతో కొంత అసౌకర్యానికి గురవుతుంటాం. మరి, ఈ చెమటను పీల్చుకోవడానికి వదులైన కాటన్‌ దుస్తులు ధరిస్తాం. అది సరే కానీ.. అరచేతులు, అరికాళ్లలో చెమట వల్ల భంగిమలు చేసేటప్పుడు కొన్నిసార్లు స్లిప్పవుతుంటుంది. అలా జరగకూడదంటే యోగా సాక్స్‌-గ్లోవ్స్‌ చక్కటి ప్రత్యామ్నాయం. వీటికి చెమటను పీల్చుకునే గుణం ఉంటుంది. అలాగే అడుగు భాగంలో యాంటీ స్లిప్‌ మెటీరియల్‌ ఉంటుంది. ఫలితంగా యోగాసనాలు వేసేటప్పుడు మనం జారకుండా జాగ్రత్తపడచ్చు. ఇలా వీటితో రెండు విధాలుగా మేలు జరుగుతుంది.

Photos: Amazon.in

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్