చర్మ సౌందర్యానికి చాక్లెట్‌

నోరూరించే చాక్లెట్‌ని... సౌందర్య పోషణకూ వాడొచ్చు. దీనివల్ల బోలెడు ప్రయోజనాలు... అవేంటో చూద్దామా?

Updated : 22 Dec 2022 13:13 IST

నోరూరించే చాక్లెట్‌ని... సౌందర్య పోషణకూ వాడొచ్చు. దీనివల్ల బోలెడు ప్రయోజనాలు... అవేంటో చూద్దామా?

* డార్క్‌ చాక్లెట్‌ను డబుల్‌ బాయిలింగ్‌ పద్ధతిలో కరిగించి పెట్టుకోవాలి. దానికి చెంచా తేనె, కొద్దిగా రోజ్‌ వాటర్‌, కాస్త కలబంద గుజ్జు కలిపి... ఆ మిశ్రమంతో ముఖానికి పూత వేయాలి. ఆరాక నీళ్లతో కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్‌, ఫ్లేవనోల్స్‌... చర్మాన్ని యూవీ కిరణాల నుంచి కాపాడి నిగనిగలాడేలా చేస్తాయి.

* చాక్లెట్లలోని ఫ్లేవనాయిడ్లు ఫ్రీరాడికల్స్‌తో పోరాడి... వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా చూస్తాయి. అలానే ఇందులోని విటమిన్లు బి, ఇ, కె, లూ, ఖనిజాలూ చర్మానికి పోషణ అందించి... ముఖానికి నిగారింపు తెస్తాయి.

* ముఖంపై ముడతలు అసలు వయసు కంటే ఎక్కువగా కనిపించేలా చేస్తాయి. ఈ ఇబ్బంది ఎదురైతే...రెండు చాక్లెట్లను కరిగించి, అందులో చెంచా పాలపొడి, రెండు చెంచాల నిమ్మరసం, కొద్దిగా ఆలివ్‌ నూనె కలిపి...ముఖం, మెడ, చేతులకు రాసుకోవాలి. ఆరాక గోరు వెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే   సరి.  

* చర్మం నిర్జీవంగా కనిపిస్తున్నప్పుడు... అరకప్పు కోకో పౌడర్‌లో పావుకప్పు పాలు, కొద్దిగా తేనె, చెంచా పెసర పిండి కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆపై రెండు నిమిషాలాగి చేతుల్ని తడిపి, ముని వేళ్లతో సవ్య, అపసవ్య దిశల్లో మృదువుగా రుద్దాలి. అప్పుడు చర్మంపై మృతకణాలు తొలిగి కాంతిమంతంగా కనిపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్