Walnuts: ఎముక బలానికి వాల్‌నట్లు బిగించండి!
ఇంటిల్లిపాది ఆకలినీ, అవసరాలనూ తీర్చే మహిళలు... తమకు అందాల్సిన పోషకాల గురించి మాత్రం పట్టించుకోరు. రోజూ ఐదారు వాల్‌నట్ పప్పుల్ని తింటే... ఎన్నో లాభాలని చెబుతారు పోషకాహార నిపుణులు. అవేంటంటే... బాగా ఆకలిగా ఉన్నప్పుడు చిరుతిళ్లకు బదులు నాలుగైదు వాల్‌నట్ పప్పుల్ని తీసుకున్నా పొట్ట నిండుతుంది.
ఇంటిల్లిపాది ఆకలినీ, అవసరాలనూ తీర్చే మహిళలు... తమకు అందాల్సిన పోషకాల గురించి మాత్రం పట్టించుకోరు. రోజూ ఐదారు వాల్‌నట్ పప్పుల్ని తింటే... ఎన్నో లాభాలని చెబుతారు పోషకాహార నిపుణులు. అవేంటంటే...
* బాగా ఆకలిగా ఉన్నప్పుడు చిరుతిళ్లకు బదులు నాలుగైదు వాల్‌నట్ పప్పుల్ని తీసుకున్నా పొట్ట నిండుతుంది. వీటిలోని పాలీశాచ్యురేటెడ్ ఫ్యాట్ల వల్ల త్వరగా ఆకలి వేయదు. రక్తపోటు లేదా మధుమేహంతో బాధపడేవారు రోజూ ఓ ఐదు తీసుకుంటే మంచిది. ఇక, ఈ వాల్‌నట్లలో ఉండే ఐరన్, క్యాల్షియం వంటి ఖనిజాలు రక్తహీనతను తగ్గించి ఎముక దృఢత్వాన్ని పెంచుతాయి. ఫలితంగా ఆస్టియో పోరోసిస్ సమస్య ఎదురుకాదు.
* వాల్‌నట్లలోని ఎసెన్షియల్ ఫ్యాటీ ఆమ్లాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఏకాగ్రతను పెంచుతాయి. వయసు మళ్లిన తర్వాత వచ్చే మానసిక ఆందోళనల్నీ ఇందులోని పోషకాలు నియంత్రిస్తాయి.
* వీటిల్లో మాంసకృత్తులు, పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల పోషకాహారలేమిని అధిగమించొచ్చు. రోజూ గుప్పెడు వాల్‌నట్లను తింటే....బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందంటున్నాయి అధ్యయనాలు.
* తల్లికావాలనుకునే మహిళలు వాల్‌నట్లను తప్పనిసరిగా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు గర్భధారణ సమయంలో వచ్చే జస్టేషనల్ డయాబెటిస్‌తో పాటు అనేక అనారోగ్యాలకు అడ్డుకట్ట వేయచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.