Summer Gadgets : వెరైటీ ‘డ్రింక్ డిస్పెన్సర్స్’!
వేసవిలో శరీరం తేమను కోల్పోకుండా ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. అయితే సాధారణ నీళ్లు తాగడం ఇష్టం లేని వాళ్లు.. దీనికి ప్రత్యామ్నాయంగా రుచికరమైన నీటిని తయారుచేసుకుంటారు. పండ్లు-కీరా-నిమ్మ.. వంటి ముక్కలు, పుదీనా-కొత్తిమీర.. వంటి ఆకులు వేసుకొని....
వేసవిలో శరీరం తేమను కోల్పోకుండా ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. అయితే సాధారణ నీళ్లు తాగడం ఇష్టం లేని వాళ్లు.. దీనికి ప్రత్యామ్నాయంగా రుచికరమైన నీటిని తయారుచేసుకుంటారు. పండ్లు-కీరా-నిమ్మ.. వంటి ముక్కలు, పుదీనా-కొత్తిమీర.. వంటి ఆకులు వేసుకొని తయారుచేసుకునే ఈ నీటిని ‘ఇన్‌ఫ్యూజ్‌డ్ వాటర్’గా పిలుస్తాం. అయితే ఈ నీటిని ఇంటిల్లిపాదికీ సరిపడేలా ఎక్కువ మొత్తంలో తయారుచేసుకొని నిల్వ చేసుకునేందుకు ప్రస్తుతం విభిన్న ‘డ్రింక్ డిస్పెన్సర్స్’ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
గుండ్రంగా, దీర్ఘచతురస్రాకారంలో, పండ్ల ఆకృతిలో, మిక్సర్-గ్రైండర్ మాదిరిగా, అండాకృతిలో.. ఇలా విభిన్న ఆకృతుల్లో రూపొందించిన వీటికి అడుగున కుళాయిని కూడా జతచేశారు. దాంతో ఎవరు కావాలంటే వాళ్లు కావాల్సినన్ని నీటిని గ్లాసులో పట్టుకొని తాగేయచ్చు. వీటిలో కొన్ని లేయర్స్ మాదిరిగా, మరికొన్ని పార్టిషన్స్ చేసినవి, ఇంకొన్ని ఫోల్డబుల్ తరహావి కూడా దొరుకుతున్నాయి. గాజుతో తయారుచేసిన వీటిని పగలకుండా జాగ్రత్తగా అమర్చుకోవడానికి వీలుగా విభిన్న స్టాండ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కేవలం ఇన్‌ఫ్యూజ్‌డ్ వాటరే కాదు.. పండ్ల రసాల్ని కూడా ఈ డిస్పెన్సర్స్‌లో సర్వ్ చేసుకోవచ్చు.
మరి, బహుళ ప్రయోజనాలున్న, ఆకర్షణీయమైన అలాంటి డ్రింక్ డిస్పెన్సర్లపై మీరూ ఓ లుక్కేసేయండి!
Photos: Amazon.in
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.