Summer Gadgets: ఐస్‌క్యూబ్స్.. ఇలా వెరైటీగా!
ఈ వేసవి కాలంలో ఏదైనా చల్లచల్లగా తీసుకోవాలనుకుంటాం. ఇంటికొచ్చిన అతిథులకూ కూల్‌గా సర్వ్ చేయాలనుకుంటాం. అందులోనూ కాక్‌టెయిల్స్, పండ్ల రసాలు.. వంటి పానీయాల్ని సర్వ్...
ఈ వేసవి కాలంలో ఏదైనా చల్లచల్లగా తీసుకోవాలనుకుంటాం. ఇంటికొచ్చిన అతిథులకూ కూల్‌గా సర్వ్ చేయాలనుకుంటాం. అందులోనూ కాక్‌టెయిల్స్, పండ్ల రసాలు.. వంటి పానీయాల్ని సర్వ్ చేసేటప్పుడు.. వాటికి జతగా కొన్ని ఐస్‌క్యూబ్స్ కూడా అందించడం మనకు అలవాటే! అయితే అది కూడా కాస్త వెరైటీగా, సరికొత్త షేప్స్‌లో ఉన్న ఐస్‌క్యూబ్స్ అందిస్తే.. అతిథుల్ని ఇట్టే ఆకట్టుకోవచ్చు. అలాంటి ఐస్‌క్యూబ్స్ మేకింగ్ మౌల్డ్స్ ప్రస్తుతం మార్కెట్లో బోలెడన్ని లభిస్తున్నాయి.
చాక్లెట్‌లా పొడవుగా ఉన్నవి, డైమండ్ ఆకృతిలో రూపొందించినవి, గుండ్రటి గోళీల్లా తయారైనవి, విభిన్న పండ్ల ఆకృతుల్లో డిజైన్ చేసినవి, షాట్ గ్లాస్ షేప్‌లో ఉన్నవి, గ్లోబు మాదిరిగా తీర్చిదిద్దినవి, గులాబీ వంటి పూల ఆకృతుల్లో తయారుచేసినవి, హృదయాకృతిలో ఉన్నవి, ఇంగ్లిష్ అక్షరాలను పోలి ఉన్నవి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సరికొత్త డిజైన్లలో ఇవి దొరుకుతున్నాయి.
వీటిలో కొన్ని మౌల్డ్స్ ఆకృతిలో ఉంటే.. మరికొన్ని మూసి ఉంచిన ట్రే మాదిరిగా ఉన్నవి దొరుకుతున్నాయి. ఈ తరహా మౌల్డ్స్ మూతకు పైభాగంలో చిన్న రంధ్రం ఉంటుంది. అందులో నుంచి నీళ్లు పోసి ఫ్రీజర్‌లో పెట్టేస్తే సరి.. మనకు నచ్చిన ఆకృతుల్లో ఐస్‌క్యూబ్స్ రడీ అయిపోతాయి. పైగా ఈ మౌల్డ్స్ సిలికాన్‌తో తయారైనవి కాబట్టి అందులో నుంచి ఐస్ వేరు చేయడం కూడా సులభం. ఇక వీటిలో నీళ్లే కాదు.. పండ్ల రసాల్ని నింపుకొని.. విభిన్న ఆకృతుల్లో ఫ్రూట్ ఐస్‌క్యూబ్స్ కూడా తయారుచేసుకోవచ్చు. వీటిని పిల్లలకు అందిస్తే ఇష్టంగా లాగించేస్తారు. మరి, అలాంటి కొన్ని వెరైటీ ఐస్‌క్యూబ్ మౌల్డ్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.