ఆ దీపాలు డ్యాన్స్‌ చేస్తాయి!

పలుచని వస్త్రం... దాన్ని చేతిలో పట్టుకొని నృత్యం చేసే అమ్మాయి. మెలికలు తిరిగే డ్రాగన్‌... అందంగా నర్తించే తెల్ల నెమలి... భిన్నరకాల పూరెక్కలు... ఇలాగే ఉంటాయి రాధికా సాంఘ్వి డిజైన్‌ చేసే లైట్లు.

Published : 17 Jun 2024 04:12 IST

స్మార్ట్‌ హోమ్‌

పలుచని వస్త్రం... దాన్ని చేతిలో పట్టుకొని నృత్యం చేసే అమ్మాయి. మెలికలు తిరిగే డ్రాగన్‌... అందంగా నర్తించే తెల్ల నెమలి... భిన్నరకాల పూరెక్కలు... ఇలాగే ఉంటాయి రాధికా సాంఘ్వి డిజైన్‌ చేసే లైట్లు. ఈవిడది అహ్మదాబాద్‌. నాన్న ఆర్టిస్ట్‌. ఇక అమ్మ అయితే పనికి రాదన్న వస్తువునీ అందమైన కళాకృతులుగా తీర్చిదిద్దేది. ఎప్పటికప్పుడు ఇల్లు వీటితో అందంగా మారిపోయేదట. కళలపై ప్రేమతో ఎగ్జిబిషన్లు వగైరా వెళుతుండేది వీళ్ల కుటుంబం. అలా ప్రముఖులను ఎందరినో కలుసుకున్నారు రాధిక. అదే ఆవిడను ‘సృజనాత్మక’ రంగంవైపు ఆకర్షితురాలిని చేసింది. అందుకు ఆమె ఎంచుకున్న వేదిక ‘స్కల్‌ప్చర్‌ డిజైన్‌’. దీనిలోనే చదువు పూర్తిచేశారు. తన కళాకృతులు ప్రకృతిహితంగా ఉండాలనుకున్నారామె. అందుకే ఎండిన కొమ్మలు, రెల్లుగడ్డి కాడలు, కాగితాలనే వీటి తయారీకి ఉపయోగిస్తారు. వీటిని ఆసరాగా చేసుకొని నృత్యం చేస్తున్నట్లుగా ఉండే ఆకారాలను సృష్టిస్తారిలా. వాటిలో లైట్లను అమరుస్తారు. వీటిలో చాలావరకూ రొటేట్‌ చేసేవే! దీంతో ఆమె ఎలక్ట్రిక్‌ దీపాలు ఆ గదికే ప్రత్యేక అలంకరణగా మారతాయి. వీటితో ఎగ్జిబిషన్లనీ నిర్వహిస్తారు రాధిక. దేశీ, విదేశీ మ్యూజియాలు, రెస్టరంట్లు, పెద్ద హోటళ్లు ఈమెకు కస్టమర్లు. అలా ఇన్‌స్టలేషన్‌ డిజైనర్‌గానూ గుర్తింపు పొందారామె. అన్నట్టూ ఈమె నగల డిజైనర్‌ కూడా. ఇక్కడా సస్టెయినబిలిటీకే ప్రాధాన్యమిస్తారు. ఫ్యాషన్‌కి పర్యావరణ హితాన్ని జోడిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్