మహిళల్లో మధుమేహం.. శృంగార కోరికలు తగ్గుతాయా?
మధుమేహం.. ఆడ, మగ, చిన్నా, పెద్దా తేడా లేకుండా ఈ రోజుల్లో అతి సర్వసాధారణంగా మారిపోయిన ఆరోగ్య సమస్య ఇది! ఇందుకు మన జీవనశైలి మార్పులే ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. నిజానికి ఆడవారితో పోల్చితే మగవారే ఎక్కువగా ఈ సమస్య బారిన....
మధుమేహం.. ఆడ, మగ, చిన్నా, పెద్దా తేడా లేకుండా ఈ రోజుల్లో అతి సర్వసాధారణంగా మారిపోయిన ఆరోగ్య సమస్య ఇది! ఇందుకు మన జీవనశైలి మార్పులే ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. నిజానికి ఆడవారితో పోల్చితే మగవారే ఎక్కువగా ఈ సమస్య బారిన పడినప్పటికీ.. దీనివల్ల తదనంతర సమస్యలు, అనారోగ్యాలు మహిళల్లోనూ ఎక్కువే అంటున్నాయి అధ్యయనాలు. అందుకే మధుమేహం వచ్చాక ఇబ్బందులు పడే కంటే.. రాకుండా ముందు జాగ్రత్తలు పాటించడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. మరి, ఇంతకీ మధుమేహం మహిళల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏయే అనారోగ్యాలకు కారణమవుతుంది? తెలుసుకోవాలంటే.. ఇది చదివేయండి!
ఆ ఇన్ఫెక్షన్ల ముప్పు..!
వందలో యాభై మంది మహిళలు తమ జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి ‘వెజైనా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల’ ముప్పును ఎదుర్కోవాల్సి రావచ్చంటున్నారు నిపుణులు. అయితే ఇందుకు గల కారణాలను పరిశీలిస్తే.. వాటిలో మధుమేహం ఉన్న వారిలోనే ఈ రెండు ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. రక్తంలో చక్కెర స్థాయులు ఎక్కువగా ఉండడం వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం, మూత్రాశయంలో మూత్రం పూర్తిగా ఖాళీ కాకపోవడం వల్ల అక్కడ బ్యాక్టీరియా అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే వెజైనా దగ్గర ఈస్ట్ ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదమూ అధికమే! కాబట్టి ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే.. ముందు నుంచే రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంచుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగడం, కాటన్ లోదుస్తులు ధరించడంతో పాటు మూత్రాన్ని ఆపుకోకుండా జాగ్రత్తపడాలి.
ఆ కోరిక తగ్గిపోతుంది!
మధుమేహం కారణంగా రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం, హార్మోన్లలో మార్పులు, నరాల బలహీనత.. వంటి సమస్యలొస్తాయి. ఇవి లైంగిక జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. శృంగార ఆసక్తి, సామర్థ్యం తగ్గిపోవడం, వెజైనా పొడిబారిపోయి కలయికలో అసౌకర్యం కలగడం.. వీటి వల్ల దాంపత్య బంధంలోనూ కలతలొస్తాయి. కాబట్టి లైంగిక కోరికలు తగ్గితే అది మధుమేహంగా అనుమానించి సంబంధిత పరీక్షలు చేయించుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అలాగే నిపుణుల సలహా మేరకు చికిత్స చేయించుకోవడం, లూబ్రికెంట్లు వాడడం, వ్యాయామాలు చేయడం.. వంటి ప్రత్యామ్నాయ మార్గాల్ని అనుసరించచ్చు.
సంతానలేమి!
రక్తంలో చక్కెర స్థాయులు ఎక్కువగా ఉన్నప్పుడు గర్భధారణ కూడా కష్టమేనంటున్నారు నిపుణులు. ఒకవేళ గర్భం వచ్చినా తొలి నెలల్లోనే గర్భస్రావం కావడం, పుట్టే పిల్లల్లో అవకరాలు రావడం, ప్రి-మెచ్యూర్ డెలివరీ, పుట్టే పాపాయిలో శ్వాస సంబంధిత సమస్యలు.. ఇలా మధుమేహం ఉన్న మహిళలు గర్భం ధరిస్తే మంచి కంటే చెడు పరిణామాలే ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు. కాబట్టి ఇలాంటి వారు ముందుగా నిపుణుల సలహా మేరకు మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవడం ముఖ్యం. ఈ క్రమంలో డాక్టర్ సూచించిన మందులతో పాటు తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి.. వ్యాయామాన్నీ జీవనశైలిలో చేర్చుకోవాలి.
అలాగే గర్భం ధరించాక కొంతమందిలో మధుమేహం వస్తుంటుంది. దీన్నే ‘జెస్టేషనల్ డయాబెటిస్’ అంటారు. ఇలాంటి సమయంలో డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ పలు జాగ్రత్తలు పాటించడం ముఖ్యం.
మెనోపాజ్‌లో ఇలా!
సాధారణంగానే మెనోపాజ్‌లో వేడి ఆవిర్లు, మూడ్‌స్వింగ్స్, నిద్రలేమి, ఒత్తిడి-ఆందోళన.. వంటి ఎన్నో సమస్యలు మహిళల్ని వేధిస్తుంటాయి. అయితే మధుమేహం ఉన్న వారిలో ఈ సమస్యల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. ఇందుకు కారణం.. శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయులు బాగా పడిపోయి.. రక్తంలో చక్కెర స్థాయుల్లో హెచ్చుతగ్గులు అనూహ్యంగా ఉంటాయి. తద్వారా మెనోపాజ్ సమస్యల తీవ్రత పెరగడంతో పాటు వెజైనా పొడిబారిపోవడం, నరాల డ్యామేజ్.. వంటి లైంగిక సంబంధిత సమస్యలూ తీవ్రమవుతాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారి సలహా మేరకు ఇన్సులిన్/ఇతర మందులు వాడడం వల్ల కొంతవరకు ఉపశమనం పొందచ్చు.
ఇవి మహిళల్లోనే ఎక్కువట!
మధుమేహం కారణంగా గుండె సమస్యల ముప్పు పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. అయితే ఇది పురుషుల్లో రెండు రెట్లు ఉంటే.. మహిళల్లో నాలుగు రెట్లు ఉందని.. దీనివల్ల చాలామంది గుండెపోటు, సంబంధిత సమస్యల నుంచి బయటపడడమూ కష్టంగా మారుతుందంటున్నారు. అంతేకాదు.. మధుమేహం కారణంగా నెలసరి సమస్యలు, కంటి చూపు తగ్గిపోవడం, మూత్ర పిండ సమస్యలు, డిప్రెషన్.. వంటి వాటి ముప్పూ స్త్రీలలో ఎక్కువగానే ఉందంటున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
మహిళల్లో మధుమేహ సమస్య రాకుండా జాగ్రత్తపడాలన్నా, అదుపు చేసుకోవాలన్నా కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
❀ బరువు అదుపులో ఉంచుకోవాలి.. ఇందుకోసం నిపుణులు సూచించిన వ్యాయామాలు చేయాలి.
❀ పండ్లు, కాయగూరలు.. ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవాలి.
❀ విటమిన్లు, ఖనిజాలు.. వంటి పోషకాలు ఉండే మొక్కల ఆధారిత ఆహారం తీసుకోవడం మంచిది.
❀ ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడానికి బదులు తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తినడం ఉత్తమం.
❀ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే బ్రెడ్, బంగాళాదుంప, సెరల్స్.. వంటివి దూరం పెట్టి.. సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఓట్మీల్, తృణ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి.
❀ నీళ్లు ఎక్కువగా తాగాలి. ఇదే సమయంలో చక్కెరలు అధికంగా ఉండే శీతల పానీయాల్ని దూరం పెట్టడం మర్చిపోవద్దు.
❀ పీచు ఎక్కువగా ఉండే అవకాడో, స్ట్రాబెర్రీ, యాపిల్స్.. వంటివి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా జాగ్రత్తపడచ్చు.
వీటితో పాటు నిర్ణీత వ్యవధుల్లో మధుమేహ పరీక్షలు చేయించుకోవడమూ మర్చిపోవద్దు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!