Sexual Health: శృంగార జీవితం బాగుండాలంటే వ్యాయామాలు చేయాల్సిందే!
దాంపత్య జీవితంలో శృంగారం పాత్ర కీలకం! అయితే కొన్ని జీవనశైలి మార్పులు, అనారోగ్యాలు లైంగిక జీవితాన్ని దెబ్బ తీస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా స్థూలకాయం కారణంగా 43 శాతం మంది మహిళలు, 31 శాతం మంది పురుషులు లైంగిక జీవితానికి....
దాంపత్య జీవితంలో శృంగారం పాత్ర కీలకం! అయితే కొన్ని జీవనశైలి మార్పులు, అనారోగ్యాలు లైంగిక జీవితాన్ని దెబ్బ తీస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా స్థూలకాయం కారణంగా 43 శాతం మంది మహిళలు, 31 శాతం మంది పురుషులు లైంగిక జీవితానికి దూరమైనట్లు జాతీయ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దీని ప్రభావం అనుబంధాల పైనే కాదు.. ఆరోగ్యం పైనా పడుతుంది. అందుకే ఈ సమస్యను అధిగమించాలంటే వ్యాయామమే సరైన మార్గం అంటున్నారు నిపుణులు. మరి, వ్యాయామానికి, శృంగార సామర్థ్యం పెరగడానికి సంబంధమేంటో తెలుసుకుందాం రండి..!
శృంగారం వల్ల దంపతుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. అయితే ఈ ఆసక్తి పెరగాలంటే.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా ముఖ్యమేనంటున్నారు నిపుణులు. వివిధ రకాల వర్కవుట్స్ వల్ల శరీరం స్పందించే విధానం, పలు శారీరక చర్యలు ఈ కోరికల్ని పెంచడానికి దోహదం చేస్తాయంటున్నారు.
ఆకర్షణ పెరుగుతుంది!
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చక్కటి శరీరాకృతి మన సొంతమవుతుంది. ఇది మనలో స్వీయ ప్రేమను, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే భాగస్వామికి మన పట్ల ఆకర్షణ మరింత పెరుగుతుంది. ఇది లైంగిక చర్యకు ప్రేరేపించడంతో పాటు కలయికనూ ఆస్వాదించేలా చేస్తుందంటున్నారు నిపుణులు.
కండరాలు చురుగ్గా..!
వ్యాయామం చేయని మహిళలతో పోల్చితే వ్యాయామం చేసే మహిళల్లో లైంగిక కోరికలు పెరిగినట్లు టెక్సాస్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. అదెలాగంటే.. వర్కవుట్స్ చేసే క్రమంలో గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.. శ్వాస తీసుకోవడమూ ఎక్కువవుతుంది. తద్వారా కండరాలు మరింత చురుగ్గా పనిచేస్తాయి.. ఈ మార్పులన్నీ అంతిమంగా లైంగిక కోరికలు పెంచడంతో పాటు శృంగారాన్నీ ఆస్వాదించేలా చేస్తాయట!
ఒత్తిడి తగ్గితే సరి!
లైంగికాసక్తిని, శృంగార కోరికల్ని హరించే వాటిలో ఒత్తిడిది అగ్రస్థానం. వివిధ వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాలు మనల్ని ఒత్తిడి, ఆందోళనల్లోకి నెట్టేస్తున్నాయి. అందుకే వీటిని తగ్గించుకోవాలంటే రోజూ వ్యాయామం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. ఇలా వివిధ రకాల వర్కవుట్స్ చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు (హ్యాపీ హార్మోన్లు) విడుదలవుతాయి. ఇవి శారీరక నొప్పులు, ఒత్తిడి-ఆందోళనల్ని తగ్గించడంతో పాటు సంతోషాన్ని-ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయి. తద్వారా లైంగికాసక్తి కూడా క్రమంగా పెరుగుతుంది.
రక్తప్రసరణ మెరుగవుతుంది..!
శరీరంలో ఏ అవయవమైనా ఆరోగ్యంగా ఉండాలన్నా, చురుగ్గా పనిచేయాలన్నా.. ఆయా భాగానికి సరైన రక్తప్రసరణ జరగడం ముఖ్యం. లైంగిక అవయవాలకూ ఇది వర్తిస్తుంది. అయితే ఇందుకూ వ్యాయామమే సరైన మార్గం అంటున్నారు నిపుణులు. వర్కవుట్స్ చేసే క్రమంలో గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. తద్వారా శరీర అవయవాలకు రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఈ క్రమంలో లైంగిక అవయవాలూ యాక్టివేట్ అవుతాయి. శరీరంలో జరిగే ఈ మార్పులన్నీ లైంగిక అవయవాల ఆరోగ్యానికి, శృంగార సామర్థ్యాన్ని పెంచడానికి దోహదం చేస్తాయి.
ఏయే వ్యాయామాలు మంచివి?
శృంగార సామర్థ్యాన్ని, ఆసక్తిని పెంచాలంటే కొన్ని రకాల వ్యాయామాలు చేయడం మంచిదంటున్నారు నిపుణులు. కీగల్, స్క్వాట్స్, లాంజెస్, పుషప్స్, ప్లాంక్ వ్యాయామాలతో పాటు.. నడక, పరుగు, ఈత, సైక్లింగ్.. వంటివీ రోజువారీ వర్కవుట్‌లో భాగం చేసుకోవాలి. ఇవి కటి వలయంలోని కండరాల్ని దృఢం చేసి లైంగిక చర్యను పూర్తిగా ఆస్వాదించేలా చేస్తాయి. ఇక ఈ వ్యాయామాలన్నీ ఒంటరిగా కాకుండా.. మీ భాగస్వామితో కలిసి జంటగా చేస్తే.. ఇద్దరి మధ్య ఆకర్షణ క్రమంగా పెరుగుతుంది. కలయికను ఆస్వాదించడానికి ఇదీ ముఖ్యమే!
అయితే ఇన్ని చేసినా లైంగికాసక్తి పెరగకపోయినా, ఇతర వ్యక్తిగత కారణాలేవైనా ఉన్నా.. ఆలస్యం చేయకుండా సంబంధిత నిపుణుల్ని సంప్రదిస్తే సమస్య తీవ్రం కాకముందే పరిష్కరించుకోవచ్చు. ఇది అనుబంధానికి, ఆరోగ్యానికి.. ఇలా రెండు విధాలుగానూ మంచిదే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
- గడువు దాటితే వద్దు...
ఆరోగ్యమస్తు
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
- వ్యాయామం చేయలేకపోతున్నారా?
అనుబంధం
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
- పిల్లలకీ కావాలో రొటీన్!
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
- వాచీ రింగు పూల హంగు!
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!