జుట్టూడకుండా.. ఈ జాగ్రత్తలు!

చిన్న వయసులోనే జుట్టూడిపోవడం అన్నది ఈమధ్య కామనైపోయింది.. ఇందుకు కారణాలెన్నో. అయితే ఎవరికి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే జుట్టూడిపోకుండా కొంతవరకు కాపాడుకోవచ్చు. ఈ క్రమంలో- జుట్టు ఆరోగ్యానికి పాటించాల్సిన కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం రండి..

Published : 19 Jun 2024 12:20 IST

చిన్న వయసులోనే జుట్టూడిపోవడం అన్నది ఈమధ్య కామనైపోయింది.. ఇందుకు కారణాలెన్నో. అయితే ఎవరికి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే జుట్టూడిపోకుండా కొంతవరకు కాపాడుకోవచ్చు. ఈ క్రమంలో- జుట్టు ఆరోగ్యానికి పాటించాల్సిన కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం రండి..

శరీరానికి హెల్దీ లైఫ్‌స్టైల్‌ ఎంత అవసరమో.. శిరోజాల సంరక్షణకు కూడా ఆరోగ్యకరమైన జీవనశైలి తప్పనిసరి. ఇందులో భాగంగా మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల శరీరంలో నీటి స్థాయులు పెరగడమే కాకుండా చర్మంలోని మలినాలు, వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా జుట్టు కూడా ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది. అవసరమైతే వైద్యులను సంప్రదించి విటమిన్‌ సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఇందులోని పోషకాలు జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తాయి.

జుట్టు బాగా ఆరోగ్యంగా పెరగాలంటే క్రమం తప్పకుండా హెయిర్‌ను ట్రిమ్‌ చేసుకోవాలి.

తలస్నానానికి బాగా వేడిగా ఉండే నీళ్లు ఉపయోగించడం వల్ల జుట్టు కుదుళ్లకు నష్టం కలుగుతుంది. కాబట్టి గోరువెచ్చని నీటినే తలస్నానానికి ఉపయోగించాలి. వెంట్రుకలు దృఢత్వాన్ని సంతరించుకోవాలంటే స్నానం తర్వాత కండిషనర్‌ను రాసుకోవడం తప్పనిసరి.

స్నానం చేసిన తర్వాత సాధ్యమైనంతవరకు జుట్టును సహజంగానే ఆరనివ్వాలి. వేడి కలిగించే హెయిర్‌ డ్రయర్స్‌ను అధికంగా వాడడం వల్ల కుదుళ్లలో దురద, అలర్జీలు, జుట్టు చివర్లు చిట్లడం... వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే తలస్నానం చేశాక జుట్టును తుడుచుకునేందుకు రెగ్యులర్ టవల్స్ బదులు మైక్రోఫైబర్‌ ర్యాపర్స్‌ను వినియోగిస్తే మేలు.

తలస్నానం చేసిన వెంటనే జుట్టును దువ్వకూడదు. అలా చేస్తే వెంట్రుకలు తెగిపోవడం, ఎక్కువ జుట్టు రాలిపోవడం... వంటి సమస్యలొస్తాయి. జుట్టు దువ్వుకోవడానికి కూడా మెత్తటి బ్రిజిల్స్ ఉండే దువ్వెనను ఉపయోగించడం ఉత్తమం.

చల్లటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఉన్నితో తయారుచేసిన టోపీలతో జుట్టును కవర్ చేయడం ఉత్తమం. లేకపోతే చల్లటి గాలులు కురులకు నష్టం కలిగిస్తాయి.

కేశ సౌందర్య సమస్యలన్నింటినీ దూరం చేసుకుని ఆరోగ్యకరమైన జుట్టును సొంతం చేసుకోవాలంటే మసాజ్‌కు మించిన సాధనం లేదు. కాబట్టి కనీసం వారానికోసారైనా హెయిర్‌ మసాజ్‌ చేసుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్