ఆ అమ్మాయిలో ఆ భయం ఎలా పోగొట్టాలి?

నేనో సంస్థలో ఉన్నత హోదాలో ఉన్నాను. నా దగ్గర పనిచేసే వారితో స్నేహంగా ఉన్నా.. పని విషయంలో మాత్రం నేను కఠినంగా ఉంటాననే పేరుంది. ప్రస్తుతం ఎనిమిది మంది ఉన్న బృందంలోకి కొత్తగా ఒకమ్మాయి ఇంటర్న్‌షిప్ కోసం వచ్చింది. పని విషయంలో బాగా.....

Published : 27 Jul 2022 21:29 IST

నేనో సంస్థలో ఉన్నత హోదాలో ఉన్నాను. నా దగ్గర పనిచేసే వారితో స్నేహంగా ఉన్నా.. పని విషయంలో మాత్రం నేను కఠినంగా ఉంటాననే పేరుంది. ప్రస్తుతం ఎనిమిది మంది ఉన్న బృందంలోకి కొత్తగా ఒకమ్మాయి ఇంటర్న్‌షిప్ కోసం వచ్చింది. పని విషయంలో బాగా కష్టపడుతుంది. ఏదైనా మాట్లాడాల్సి వస్తేనే ఆందోళన పడుతుంది. ఆ అమ్మాయిలో కంగారు తగ్గి ఆత్మవిశ్వాసంతో అందరిముందూ మాట్లాడాలంటే నేనెలాంటి ప్రయత్నాలు చేయాలి? - ఓ సోదరి

జ. మీ టీమ్‌లో చేరిన అమ్మాయి ఆందోళన తగ్గాలంటే పని వాతావరణంలో కొన్ని మార్పులు చేసి చూడండి. తను చేసే పని విషయంలో రాజీ పడకుండానే, వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూడాలి. ఇలాంటి వాతావరణంలో మీ దగ్గర పనిచేసేవాళ్లు తమ అభిప్రాయాలను నిజాయతీగా, ధైర్యంగా చెప్పగలుగుతారు. ఎలాంటి సమస్యలున్నా వాటిని మీకు వివరించగలుగుతారు. సమావేశాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా అక్కడి వాతావరణం గంభీరంగా కాకుండా, ఆహ్లాదంగా ఉండేలా చూసుకుంటే మంచిది. మీటింగ్‌లో కూడా ఇతరుల తప్పులు ఎత్తి చూపకుండా, దేనికి సంబంధించి సమావేశమయ్యారో ఆ విషయాన్నే చర్చించాలి. బృంద సభ్యులు ఒక పనిని బాగా చేసినప్పుడు ప్రశంసించడం మర్చిపోవద్దు.

ఈ క్రమంలో- మీ బృందంలో పనిచేస్తోన్న ఇంటర్న్‌తో ఓసారి మాట్లాడండి. ఉత్పాదకత పెరిగేందుకు ఏం చేయాలో అడగండి. ఆ అమ్మాయిని కొన్ని ప్రజెంటేషన్లు చేసి అందరి ముందూ చెప్పమని ప్రోత్సహించండి. అది ఆదేశంలా కాకుండా, ఫ్రెండ్లీగా చెప్పండి. మొదట్లో ఓ మోస్తరుగా చెప్పినా, ' బాగా ప్రజెంట్ చేశారు' అంటూ ప్రశంసించండి. తను సీనియర్లతో కలిసి పని చేసేలా చూడండి. దీనివల్ల వారి నుంచి తనకు సరైన గైడెన్స్ లభించేలా చేయొచ్చు. వీటన్నిటివల్ల తనలో ఉన్న భయం పోయే అవకాశం ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని