కళ్ల కింద నల్లటి వలయాలా..?

కళ్ల కింద నల్లటి వలయాలు.. చాలామందిని వేధించే సమస్య. పిల్లలు.. పెద్దలు.. అనే తేడా లేకుండా ఏ వయసు వారికైనా ఈ సమస్య ఎదురు కావచ్చు. నిద్ర సరిగ్గా లేకపోవడం, ఎక్కువ సమయం కంప్యూటర్‌పై గడపడం, టీవీ ఎక్కువగా చూడటం....

Published : 25 May 2023 20:01 IST

కళ్ల కింద నల్లటి వలయాలు.. చాలామందిని వేధించే సమస్య. పిల్లలు.. పెద్దలు.. అనే తేడా లేకుండా ఏ వయసు వారికైనా ఈ సమస్య ఎదురు కావచ్చు. నిద్ర సరిగ్గా లేకపోవడం, ఎక్కువ సమయం కంప్యూటర్‌పై గడపడం, టీవీ ఎక్కువగా చూడటం, పదేపదే కాఫీ తాగడం, ఎక్కువ ఒత్తిడికి గురికావడం, పోషకాహార లోపం.. మొదలైనవన్నీ కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటానికి కారణాలే. మరి వీటిని తగ్గించుకునే మార్గాల్లేవా? అంటే ఉన్నాయి.. అవేంటో చూద్దామా?

చల్లటి టీ బ్యాగ్స్‌తో..

టీ బ్యాగ్స్ నల్లటి వలయాలను పోగొట్టడంలో బాగా సహాయపడతాయి. దీనికోసం పది నిమిషాల పాటు రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన టీ బ్యాగ్స్‌ను కళ్లపై ఉంచుకుని 15 నిమిషాల పాటు రిలాక్స్ అవ్వాలి. ఇలా చేయడం వల్ల నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి.

టమాటోతో..

టమాటో చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. అలాగే కంటి కింద వలయాలు తొలగించడంలోనూ దీని పాత్ర కీలకమే. కొంచెం టమాటో రసంలో కాస్త నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ నెమ్మదిగా మర్దనా చేయాలి. ఇలా చేస్తే నల్లటి వలయాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. లేదా కేవలం నిమ్మరసాన్ని తీసుకుని రోజుకు రెండు సార్లు కళ్ల కింద అప్త్లె చేసినా ఫలితం ఉంటుంది.

ఉప్పు తక్కువగా..

ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు, ఆల్కహాల్.. వంటి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండటం మంచిది. దీనివల్ల కంటి కింద నల్లటి వలయాలు తగ్గడం మాత్రమే కాదు.. శరీరానికి విశ్రాంతి కూడా లభిస్తుంది.

కీరా లేదా ఆలుగడ్డ ముక్కలతో..

చల్లటి కీరా లేదా ఆలుగడ్డ ముక్కల్ని తీసుకుని కళ్లపై పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేసిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసి క్రీం అప్త్లె చేసుకోవాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే ఈ సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. ఆలుగడ్డ పొట్టు, రసం కూడా ఈ నల్లటి వలయాలను తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

బాదం నూనెతో..

రోజూ రాత్రి పడుకునే ముందు కాస్త బాదం నూనెను తీసుకుని కళ్ల చుట్టూ అప్త్లె చేసుకోవాలి. తర్వాత నెమ్మదిగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల నల్లటి వలయాలు తగ్గుతాయి. ఇదే పద్ధతి రోజ్ వాటర్‌తో చేసినా చక్కటి ఫలితం ఉంటుంది.

కంటిని నలపకూడదు..

కొంతమంది కళ్లను పదేపదే నలుపుతుంటారు. దీనివల్ల కూడా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కంటిని నలపడం ద్వారా మనంతట మనమే ఈ సమస్యను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్