చెమటకాయలకు చెక్ పెట్టాలంటే..!
సాధారణంగా శరీరం నుంచి స్వేద గ్రంథుల ద్వారా చెమట బయటికి వస్తుంది. కానీ ఎక్కడైనా ఈ గ్రంథులు మూసుకుపోతే చెమట బయటికి రాలేక శరీరంపై ఎర్రగా ఉండే చిన్న చిన్న దద్దుర్లు ఏర్పడతాయి. ఇంట్లో ఉండే పదార్థాలతో ఈ చెమటకాయల్ని వదిలించుకోవచ్చు...
సాధారణంగా శరీరం నుంచి స్వేద గ్రంథుల ద్వారా చెమట బయటికి వస్తుంది. కానీ ఎక్కడైనా ఈ గ్రంథులు మూసుకుపోతే చెమట బయటికి రాలేక శరీరంపై ఎర్రగా ఉండే చిన్న చిన్న దద్దుర్లు ఏర్పడతాయి. ఇంట్లో ఉండే పదార్థాలతో ఈ చెమటకాయల్ని వదిలించుకోవచ్చు.
ఐస్‌క్యూబ్స్‌తో..
వేడి ఎక్కువగా ఉన్నప్పుడు దాహం తీర్చుకోవడానికి ఎలాగైతే చల్లటి పానీయాలు తాగుతామో.. అలాగే చెమటకాయలు ఏర్పడినప్పుడు కూడా చల్లటి ఐస్‌ముక్కలు శరీరానికి ఉపశమనాన్నిస్తాయి. చిన్నచిన్న ఐస్‌ముక్కల్ని ఎర్రగా ఉన్న చెమటకాయలపై రుద్దాలి. ఇలా చేయడం వల్ల మంట తగ్గిపోయి తద్వారా చెమటకాయలూ తగ్గుతాయి.
చందనంతో చల్లదనం..
చందనం పొడి, కొత్తిమీర పొడి.. ఈ రెండింటినీ ఒక్కోటి రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున తీసుకుని.. ఇందులో రెండు నుంచి మూడు టేబుల్‌స్పూన్ల రోజ్‌వాటర్ వేసి మృదువైన పేస్ట్ వచ్చే వరకు బాగా కలపాలి. ఈ పేస్ట్‌ని చెమటకాయలున్న చోట పూయాలి. ఆరిపోయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేయాలి.
నిమ్మరసంతో..
నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల చెమటకాయలు తగ్గిపోవడమే కాదు.. శరీరానికి కూడా చలువ చేస్తుంది. రోజుకు నాలుగు గ్లాసుల నిమ్మరసం తాగితే ఈ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
కలబంద గుజ్జుతో..
కలబంద గుజ్జును చెమటకాయలుండే చోట పెట్టి కాసేపు అలా ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో స్నానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.