మొటిమల మచ్చలు పోవాలంటే..

మేడం.. నా ముఖంపై మొటిమల వల్ల మచ్చలు ఏర్పడ్డాయి. మచ్చలు, మొటిమలు తగ్గడానికి ఏదైనా పరిష్కార మార్గం చెప్పండి...

Published : 19 May 2023 21:04 IST

మేడం.. నా ముఖంపై మొటిమల వల్ల మచ్చలు ఏర్పడ్డాయి. మచ్చలు, మొటిమలు తగ్గడానికి ఏదైనా పరిష్కార మార్గం చెప్పండి. - ఓ సోదరి

జ. మీ ముఖంపై ఏర్పడిన మచ్చలు లేత రంగులో ఉంటే దాని పైన తేనె రాసి చూడండి. ఒకవేళ మచ్చలు ముదురు రంగులో ఉంటే ఈ ప్యాక్‌ని ప్రయత్నించండి.

ముందుగా ఒక కీరా దోసను తీసుకోండి. దానిపై తొక్కను తొలగించి లోపలి భాగాన్ని పేస్ట్ లాగా చేయాలి. ఈ పేస్ట్‌ని ఒక టేబుల్‌ స్పూన్‌ తీసుకొని అంతే మొత్తంలో బార్లీ పిండిని కలపండి. ఈ రెండింటినీ ముద్ద లాగా చేసి ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో అక్కడ అప్లై చేయండి. అలా 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి.. ఆ తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి. ఇలా మూడు నెలల పాటు వారానికి నాలుగుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

అలాగే మొటిమలు రాకుండా ఉండడం కోసం ఆయిల్‌ ఫుడ్‌ తక్కువగా తీసుకోవడం, పిల్లో కవర్స్‌ ఎప్పటికప్పుడు మార్చుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం.. వంటివి చేయాలి.
కీరా, బార్లీ.. రెండూ సహజసిద్ధమైనవే అయినా- ముఖానికి రాసే ముందు ఓసారి ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్