Published : 02/02/2022 20:47 IST

ముక్కుపై కళ్లద్దాల మచ్చలు మాయమిలా..!

కాలక్రమేణా మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానాల వల్ల ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలామంది కళ్లద్దాలు పెట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే కళ్లద్దాలు పెట్టుకుంటే కంటిచూపు బాగుంటుంది. ఓకే.. మరి వాటి వల్ల కొంతమందికి ముక్కు మీద మచ్చలు పడే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాలలో కళ్లద్దాలు తీసినప్పుడు అవి ముఖం అందాన్ని తగ్గించి చూపిస్తాయి. ఈ క్రమంలో- ముక్కు మీద ఉన్న మచ్చలు తగ్గించి ముఖారవిందాన్ని ఇనుమడింపచేసే చిట్కాలు మీకోసం..

చాలామంది ఒక్కసారి కళ్లజోడు పెడితే చాలు.. దాన్ని సర్దుతూ ఉంటారే తప్ప తీసి కాసేపు ఆగి మళ్లీ పెట్టుకుందామని అస్సలు అనుకోరు. అంతేకాకుండా కొందరు అవసరం ఉన్నా, లేకపోయినా ఎప్పుడూ కళ్లద్దాలు ధరించే ఉంటారు. ఫలితంగా ముక్కు మీద నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఇలా మచ్చలు వచ్చిన తర్వాత వాటిని నివారించడానికి మార్గాలు వెతుక్కునే కంటే అవి రాకుండానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కాబట్టి కళ్లద్దాలు ఎంపిక చేసుకునేటప్పుడే కొన్ని జాగ్రత్తలు వహించాలి.

ఎంపిక ముందు..

* కళ్లద్దాలు ఎంపిక చేసుకునేటప్పుడు లెన్స్ తక్కువ బరువు ఉన్నది ఇవ్వమని అడగాలి.

* అలాగే ఫ్రేము ఎంచుకునేటప్పుడు కూడా తేలికైనది తీసుకోవడం ఉత్తమం. దీని వల్ల కళ్లజోడు తక్కువ బరువు ఉండి ముక్కుపై అతుక్కోకుండా ఉంటుంది.

* లెన్స్, ఫ్రేము తయారు చేసిన మెటీరియల్స్ చర్మానికి హాని కలిగించకుండా ఉండేలా చూసుకోవాలి. అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన మెటల్ పడకపోవచ్చు. అలాంటివి పెట్టుకుంటే వెంటనే అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది.

* అలాగే కళ్లజోడు కొనుగోలు చేసే ముందే అది మీకు సరిగ్గా సరిపోయిందా? లేదా? అన్నది సరిచూసుకోవాలి. అది మరీ వదులుగా ఉండకూడదు. అలాగే మరీ బిగుతుగా కూడా ఉండకూడదు. అప్పుడే ముక్కు మీద మచ్చలు పడకుండా ఉంటాయి.
ముక్కు మీద మచ్చలు రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మరి, మచ్చలు వచ్చిన తర్వాత వాటిని తగ్గించుకోవడానికి గల మార్గాలు కూడా చూద్దాం రండి..

నిమ్మరసం, రోజ్‌వాటర్‌తో..

బరువైన కళ్లజోడు పెట్టుకోవడం, ఎక్కువ సమయం వాటిని అలానే ఉంచేయడం వల్ల ముక్కు మీద మచ్చలు ఏర్పడతాయి. అయితే సహజసిద్ధంగా లభించే నిమ్మరసాన్ని అప్త్లె చేయడం వల్ల ఈ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. కొద్దిగా నిమ్మరసం తీసుకుని, అందులో కాస్త రోజ్‌వాటర్ కలపాలి. ఈ రెండూ బాగా కలిపి మచ్చలు ఉన్న చోట రాయాలి. 15 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల నల్లమచ్చలు తగ్గడమే కాదు.. చర్మం ప్రకాశవంతంగా మారడాన్ని గమనించవచ్చు.

కేవలం రోజ్‌వాటర్‌ని ఉపయోగించి కూడా ఈ సమస్య నుంచి మనం సులభంగా బయటపడవచ్చు. కాస్త రోజ్‌వాటర్ తీసుకుని దానికి కొద్దిగా వెనిగర్ కలిపి ఈ మిశ్రమంతో మచ్చలు ఉన్న చోట రోజూ మర్దన చేసుకుంటే అతి తక్కువ సమయంలోనే మచ్చలు మాయమైపోతాయి.

బాదం నూనె

బాదంనూనెలో ఉండే విటమిన్ ఇ ముక్కు మీద మచ్చలు తగ్గడానికి చాలా బాగా ఉపకరిస్తుంది. అందుకే క్రమం తప్పకుండా రోజూ బాదంనూనెతో మచ్చలు ఉన్నచోట మర్దన చేసుకుంటే చక్కని ఫలితం ఉంటుంది.

తేనె

చర్మానికి సహజసిద్ధంగా తేమని అందించే పదార్థాల్లో తేనె కూడా ఒకటి. అందుకే ఇది ముక్కు మీద ఏర్పడిన మచ్చలను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో పాలు, తేనె, ఓట్స్ తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమంతో మచ్చలు ఉన్నచోట రోజూ మృదువుగా మర్దన చేయాలి. మచ్చలు తగ్గుముఖం పట్టడమే కాకుండా చర్మం తాజాగా మారి మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని